AC: రూమ్‌ కూల్‌ అయిందని ఏసీ ఆఫ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ఏసీ పూర్తిగా పాడవ్వడం ఖాయం

AC Control Tips: రూమ్ కూల్ అయిపోయిన తర్వాత ఏసీ ఆఫ్ చేస్తున్నారా? అయితే చాలామంది ఏసీ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు. తద్వారా ఏసీ డ్యామేజ్ అయిపోయాయి పరిస్థితులు ఉన్నాయి.

Update: 2025-04-14 03:30 GMT
AC

AC: రూమ్‌ కూల్‌ అయిందని ఏసీ ఆఫ్‌ చేస్తున్నారా? ఇలా చేస్తే ఏసీ పూర్తిగా పాడవ్వడం ఖాయం

  • whatsapp icon

AC Control Tips: ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎండ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ఏసీలు కూలర్లు ఉపయోగిస్తుంటారు. అవి నిరంతరం నడిచే పరిస్థితి ఏర్పడింది. అయితే ఏసీ ఆఫ్ చేయడంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తుంటారు. తద్వారా ఏసీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది.

ఈ మధ్యకాలంలో ఏసీ ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా అయిపోయింది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఆ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే సరైన రీతిలో ఉపయోగించకపోతే అది పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ డబ్బులు పెట్టి రిపేయిర్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏసీ రన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఏసీ ఆన్ చేసేటప్పుడు లేదా ఆఫ్ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

చాలామందికి తెలియక ఏసీ డైరెక్ట్ గా గోడకు ఉండే స్విచ్ ఆఫ్ చేస్తారు. కానీ అలా చేయకూడదు రిమోట్ లోనే ఏసీ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏసీ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంది. ఇది స్ప్లిట్, విండో ఏసీలకు వర్తిస్తుంది. ఇలా నేరుగా గోడకు ఉన్న స్విచ్ ఆఫ్ చేస్తే త్వరగా మెకానిక్ తో పని కూడా పడుతుంది.

ఏ ఏసీలకైనా కంప్రెసర్ అనేది ఒక గుండె వంటిది. హఠాత్తుగా స్విచ్ ఆఫ్ చేస్తే పవర్ కట్స్ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనితో కంప్రెసర్ బ్రేక్ డౌన్ అయిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్తగా కంప్రెసర్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే రిపెయిర్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.

అంతేకాదు ఏసీ టెంపరేచర్ కూడా సరైన స్థితిలో ఉండాలి. తక్కువగా పెట్టిన లేకపోతే మరీ ఎక్కువగా పెట్టిన కానీ అది మొత్తం కూలింగ్ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. దీంతో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఏసీ మోటారు, ఇంటర్నల్ ఫ్యాన్ సరైన రీతిలో పని చేయాలి . ఇలా సడన్‌గా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల మోటార్ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అంతేకాదు బోర్డు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఇంటర్నల్ గా సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఎప్పుడూ ఏసీ ఆఫ్ చేసినా రిమోట్ లో మాత్రమే ఆఫ్ చేయడం అలవాటు చేసుకోండి.

Tags:    

Similar News