Viral Video: ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాల రూ. 12 వేలు.. అంత స్పెషాలిటీ ఏంటనేగా.?
Viral Video: సమ్మర్‌లో చల్ల చల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Viral Video: ఈ ఐస్‌క్రీమ్ ధర అక్షరాల రూ. 12 వేలు.. అంత స్పెషాలిటీ ఏంటనేగా.?
Viral Video: సమ్మర్‌లో చల్ల చల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ ఐస్ క్రీమ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధారణంగా మీకు తెలిసినంత వరకు ఐస్‌క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 100కి అటు ఇటుగా ఉంటుంది అంటారు కదూ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఐస్ క్రీమ్ ధర తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్‌గా దీనికి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో అందిస్తున్న ఈ ఐస్ క్రీమ్ ధర ఏకంగా రూ.12,000. ప్రత్యేకంగా తయారు చేసే ఈ డెజర్ట్‌లో చాక్లెట్ ముక్కలు, కరిగిన చాక్లెట్, పప్పుదినుసులు, క్రీమ్, టాపింగ్స్‌తోపాటు బంగారు వర్ణం కలిగిన పూతను కూడా వేస్తారు. రిచ్ లుక్స్‌తో అదిరిపోయే టెస్ట్‌తో దీనిని రూపొందించారు. అందుకే ఈ ఐస్‌క్రీమ్‌కు అంత ప్రత్యేకత.
ఈ ఐస్ క్రీమ్‌కి సంబంధించిన వీడియోను @foodiedaakshi అనే ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగర్ షేర్ చేయగా ఏకంగా 4 లక్షల లైక్స్ వచ్చాయి. “భారతదేశంలో అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయగా నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ ఐస్‌క్రీమ్ తినాలని కొందరు, అంతలా ఈ ఐస్‌క్రీమ్‌లో ఏముందబ్బా అని మరికొందరు కామెంట్ చేశారు.