AC: మీ పాత ఏసీ గదిని కేవలం 10 నిమిషాల్లో కశ్మీర్‌లా చల్లబరుస్తుంది! 90% మందికి తెలియని ట్రిక్
AC Coolig Trick: మీ పాత ఏసీ కొత్త ఏసీలా కశ్మీర్‌లా రూమ్ చల్లబరచాలా? ఈ చిన్న ట్రిక్ పాటించండి.

AC: మీ పాత ఏసీ గదిని కేవలం 10 నిమిషాల్లో కశ్మీర్‌లా చల్లబరుస్తుంది! 90% మందికి తెలియని ట్రిక్
AC Coolig Trick: ఈ చిన్న ట్రిక్ పాటిస్తే మీ పాత ఏసీ కూడా కొత్త వాటిలా మీ రూమ్ ని కాశ్మీర్‌లా మార్చేస్తుంది. కేవలం 10 నిమిషాల్లో రూమ్ చల్లబడిపోతుంది. ఈ కూల్ ట్రిక్ చాలామందికి తెలియదు పాత ఏసీల్లో కూలింగ్ తక్కువగా వస్తుంది. అయితే దీనివల్ల ఇతర సమస్యలు కూడా వస్తాయి.
ఏసీ ఆన్ చేసే ముందే మీ గది డోర్లు, కిటికీలు ముందుగానే మూసేయండి. లేకపోతే కూలింగ్ బయటికి వెళ్లిపోతుంది. గది చల్లబడదు కరెంటు బిల్లు కూడా ఎక్కువ అవుతుంది.
ఇది మాత్రమే కాదు ఎండాకాలం ముందుగా ఒకసారి సర్వీసింగ్ తప్పకుండా చేయాలి. ఎండాకాలం పూర్తయిపోయిన తర్వాత కూడా ఏసీని సర్వీసింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే సంవత్సరంలో రెండు సార్లు సర్వీసింగ్ చేయడం వల్ల మీ ఏసీ లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది.
ఏసీ వేశారని ఫ్యాన్ పూర్తిగా ఆఫ్ చేయకూడదు. ఏసీతో పాటు ఇంట్లో ఫ్యాన్ కూడా వేయడం వల్ల గదిలో చల్లగాలి త్వరగా వ్యాపిస్తుంది. ఇది చాలా మందికి తెలియక ఏసీ ఆన్ చేయగానే ఫ్యాన్ ఆఫ్ చేస్తారు.
ఇది మాత్రమే కాదు ఎప్పటికప్పుడు ఎయిర్ ఫిల్టర్లు శుభ్రం చేస్తూ ఉండాలి. ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల చల్లగాలి రాదు. అంతేకాదు కంప్రెసర్ పై భారం కూడా ఎక్కువగా పడుతుంది. కనీసం రెండు వారాలకు ఒకసారి ఫిల్టర్ శుభ్రం చేయండి.
ఇక చాలామందికి టెంపరేచర్ తక్కువగా పెడితే అంత త్వరగా కూల్ అయిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల బిల్లు ఎక్కువగా వస్తుంది. గది ఉష్ణోగ్రత ఎప్పుడూ 24 డిగ్రీస్ మాత్రమే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీకు చర్మ సమస్యలు రావు. కరెంట్ బిల్లు ఎక్కువగా కాకుండా ఉంటుంది. గది ఉష్ణోగ్రత కూడా త్వరగా చల్లబడిపోతుంది ఏసీకి కంప్రెసర్ పెట్టడం ఎంతో ముఖ్యం.