Viral Video: చిన్న ప్రాణులే కానీ సింహాలకే చుక్కలు చూపించాయి.. వైరల్ వీడియో..!
Watch Crazy Video: సృష్టిలో ప్రతీ జీవి తన అస్తిత్వం కోసం పోరు చేస్తూనే ఉంటుంది. తన శక్తివంచన మేరకు కృషి చేస్తుంది.
Watch Crazy Video: సృష్టిలో ప్రతీ జీవి తన అస్తిత్వం కోసం పోరు చేస్తూనే ఉంటుంది. తన శక్తివంచన మేరకు కృషి చేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రాణం మీదికి వస్తే ఎదురుగా ఎంత పెద్ద జీవి ఉన్నా సరే తనను తాను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తుంది. ఊపిరి ఉన్నంత వరకు పోరు చేస్తుంటుంది. ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు, జంతువులు, పక్షులకు కూడా వర్తిస్తుంది.
తన ఎదురుగా ఉంది తనకంటే పెద్ద జంతువు అని తెలిసినా.? ఆ పోరులో తాను ఓడిపోతానని తెలిసినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. అత్యంత అరుదైన జీవుల్లో తేనె కుక్క ఒకటి. వీటిని హనీ బ్యాడ్జర్స్‌గా పిలుస్తుంటారు. ఇవి చిన్న ఎలుగుబంటిని పోలి ఉంటాయి. నిజానికి వీటి పరిమాణం చాలా చిన్నది. మరి ఇలాంటి వాటిపై సింహాలు దాడి చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా ఒకటి రెండు కాకుండా ఏకంగా ఏడు సింహాలు ఒక్కసారిగా అటాక్ చేస్తే.
కచ్చితంగా సింహాలకు ఆహారం కావడం లేదా అక్కడి నుంచి పరుగు పెడతాయి కదూ. అయితే అవి మాత్రం ఆ చేయలేదు సింహాలకే చుక్కలు చూపించాయి. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో.. ఓ సింహం గుంపు రెండు హానీ బ్యాడ్జర్లపై దాడికి దిగాయి. దీంతో హనీ బ్యాడ్జర్లు మాత్రం వెనుకడగు వేయలేదు. సింహాలతో ధైర్యంగా పోరాడి వాటి ప్రాణాలను కాపాడుకున్నాయి. జంగిల్ సఫారీలో భాగంగా కొందరు పర్యాటకులు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి చిన్న ప్రాణులే అయినా ఎంతటి ధైర్యసాహసాలను ప్రదర్శించాయో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.