ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే.. వడాపావ్ అమ్మిన వ్యక్తి రూ. 800 కోట్ల సినిమా తీసే స్థాయికి ఎదిగాడు..!
Laxman Utekar Success Story: ఇటీవల ఇండియన్ సినిమాను షేక్ చేసిన మూవీస్‌లో ఛావా ఒకటి.

ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే.. వడాపావ్ అమ్మిన వ్యక్తి రూ. 800 కోట్ల సినిమా తీసే స్థాయికి ఎదిగాడు..!
Laxman Utekar Success Story: ఇటీవల ఇండియన్ సినిమాను షేక్ చేసిన మూవీస్‌లో ఛావా ఒకటి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్ జీవిత కథ తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. నేటి యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తోన్న లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడిగా మారేందుకు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఒకప్పుడు ముంబై వీధుల్లో వడాపావ్‌లు అమ్మిన వ్యక్తి నేడు దేశం గర్వించే దర్శకుడిగా ఎలా ఎదిగాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని సమర్పూర్ అనే చిన్న గ్రామంలో జన్మించిన లక్ష్మణ్ ఉటేకర్ చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తితో ఉండేవాడు. తన కలను నెరవేర్చేందుకు ముంబైకి వచ్చాడు కానీ, ఆ నగరంలో ఆరంభ దశలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. రోజువారీ ఖర్చుల కోసం మొదట వడాపావ్ షాపులో పని చేశాడు. ఆపై ఓ సినిమా స్టూడియోలో ఫ్లోర్ క్లీన్ చేసే ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. స్టూడియోలో పనిచేస్తూ సినిమాల నిర్మాణాన్ని దగ్గరగా గమనించిన లక్ష్మణ్, అవకాశాల కోసం ఎదురుచూశాడు.
చివరికి 2007లో వచ్చిన ఖన్నా అండ్ అయ్యర్ అనే చిత్రంతో ఫోటోగ్రఫీ డైరెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తరువాత పలు యాడ్ ఫిల్మ్స్, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. లక్ష్మణ్ కొన్ని మరాఠీ సినిమాలను డైరెక్ట్ చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. కానీ 2019లో లూకా చుప్పి అనే హిందీ సినిమా అతనికి మొదటి పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిమి (కృతి సనన్ నటించిన చిత్రం), జరా హట్కే జరా బచ్కే (విక్కీ కౌశల్‌తో) వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించాడు.
లక్ష్మణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఛావా (Chhaava) బాక్సాఫీస్ వద్ద రూ.805 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో లక్ష్మణ్ ఉటేకర్‌ను బాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. మిమి చిత్రానికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (పంకజ్ త్రిపాఠి) అవార్డులు దక్కాయి. అదేవిధంగా మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం లక్ష్మణ్ ఉటేకర్ ఆస్తి విలువ రూ.50 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా. డాపావ్ బండిపై ప్రారంభమై, సినీ ప్రపంచంలో స్టార్ డైరెక్టర్‌గా మారిన లక్ష్మణ్ ఉటేకర్ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని చెప్పేందుకు లక్ష్మణ్ జీవితమే ఉదాహరణ.