Indian Railways: MEMU, EMU, DEMU రైళ్లంటే ఏంటీ, వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Indian Railways: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ సుదూర రైళ్ల పేర్లతో ముడిపడి ఉన్నాయి. మీరు తక్కువ దూరం రైళ్లలో ప్రయాణించేటప్పుడు, వాటి పేర్లకు ఆంగ్లంలో డెము (DEMU), ఈము (EMU) లేదా Memu (MEMU) అనే పదాలు చేర్చుతారు.
Indian Railways: మీరు రైళ్లలో చాలాసార్లు ప్రయాణించి ఉంటారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ సుదూర రైళ్ల పేర్లతో ముడిపడి ఉన్నాయి. మీరు తక్కువ దూరం రైళ్లలో ప్రయాణించేటప్పుడు, వాటి పేర్లకు ఆంగ్లంలో డెము (DEMU), ఈము (EMU) లేదా Memu (MEMU) అనే పదాలు చేర్చుతారు. ఈ పదాలకు అర్థం ఏమిటో తెలుసా. అవి ఎప్పుడు, ఏ రకమైన రైళ్లకు ఉపయోగాస్తారో తెలుసా? మీలో చాలా మందికి దీని గురించి ఖచ్చితంగా తెలియదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డెము రైళ్లు ఎలా ఉన్నాయి..
ముందుగా, DEMU రైళ్ల గురించి తెలుసుకుందాం.. DEMU పూర్తి రూపం డీజిల్ మల్టిపుల్ యూనిట్. నిజానికి డీజిల్‌తో తక్కువ దూరాలకు నడిచే రైళ్లను డీఎంయూ రైళ్లు అంటారు. ఇటువంటి రైళ్లలో 3 వర్గాలు ఉన్నాయి. వీటిలో డీజిల్ ఎలక్ట్రిక్ DEMU, డీజిల్ హైడ్రాలిక్ DEMU, డీజిల్ మెకానికల్ DEMU రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి మూడు కోచ్‌ల తర్వాత ఒక పవర్ కోచ్ ఉంటుంది. దీని కారణంగా ఈ రైళ్లను ఎనర్జీ ఎఫిషియెంట్ రైళ్లు అని కూడా పిలుస్తారు.
EMU రైళ్లంటే..
EMU అంటే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ట్రైన్. ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ వంటి పెద్ద మెట్రోలను సమీప నగరాలతో అనుసంధానించడానికి ఈ రైళ్లు ఉపయోగిస్తారు. ఈ రైళ్లన్నీ విద్యుత్తుతో నడుస్తాయి. వాటి వేగం గంటకు 60 నుంచి 100 కి.మీ. ఈ రైళ్లలో ఒక రకమైన పాంటోగ్రాఫ్ అమర్చబడి ఉంటుంది. ఇది రైలు ఇంజిన్‌కు విద్యుత్తును అందించడానికి పనిచేస్తుంది.
మెమూ రైళ్ల ప్రత్యేకత..
MEMU రైళ్లు అధునాతన ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతతో ఉంటాయి. ఈ రైళ్లు సాధారణంగా 200 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఉపయోగిస్తారు. అలాంటి రైళ్లలో, ప్రతి 4 కోచ్‌ల తర్వాత పవర్ కార్ కూడా ఉంటుంది. దీని సహాయంతో రైలులోని ట్రాక్షన్ మోటార్ నడుస్తుంది. అది వేగాన్ని అందించడంలో సహాయపడుతుంది.