Most Profitable Train: దేశంలో అత్యంత ధనిక రైలు.. ప్రతి ఏటా రూ.1,76,06,66,339 ఆదాయం.. టాప్ 5 జాబితాలో లేని శతాబ్ది, వందే భారత్..!
Most Profitable Train in India: భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి.
Most Profitable Train in India: భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. భారతదేశంలో ప్రతిరోజూ 13452 కంటే ఎక్కువ రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, మెయిల్ ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు కూడా పట్టాలపై నడుస్తాయి. భారతదేశంలోని రైళ్లలో ఎక్కువగా సామాన్యులు ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి, రైళ్లలో సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఏ రైలులో ఎక్కువ ఆదాయం వస్తుందో తెలుసా, అంటే రైల్వేకు చెందిన ఏ రైలు 'ధనలక్ష్మి'గా పిలుస్తుంటారో తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రైల్వేలు అత్యధికంగా ఆర్జించే రైళ్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లేదా శతాబ్ది రైలు లేకపోవడం గమనార్హం. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నా.. సంపాదన పరంగా రాజధాని ట్రైయిన్ ముందు ఏది కనిపించదు. ఉత్తర రైల్వేలో అత్యధికంగా సంపాదిస్తున్న రైలు వందే భారత్ కాదు రాజధాని ఎక్స్‌ప్రెస్. బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆదాయాల పరంగా అగ్రస్థానంలో ఉంది. రైలు నంబర్ 22692 బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ నుంచి KSR బెంగళూరుకు ప్రయాణిస్తుంది. 2022-23 సంవత్సరంలో ఈ రైలులో మొత్తం 50,9510 మంది ప్రయాణించారు. దీంతో దాదాపు రూ.1,76,06,66,339 రైల్వే అకౌంట్‌లోకి వచ్చాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాను దేశ రాజధాని న్యూఢిల్లీతో కలుపుతున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైల్వేస్ రెండవ అత్యధిక సంపాదన కలిగిన రైలు. రైలు నంబర్ 12314 సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 5,09,164 మందిని గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా ఈ రైలు ఆదాయం రూ. 1, 28,81,69,274కి చేరుకుంది.
ఈ జాబితాలో దిబ్రూఘర్ రాజధాని మూడవ స్థానంలో ఉంది. న్యూఢిల్లీ, దిబ్రూగఢ్ మధ్య నడుస్తున్న ఈ రైలు గత ఏడాది 4,74,605 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని వల్ల రైల్వేకు మొత్తం రూ.1,26,29,09,697 ఆదాయం సమకూరింది.
అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే టాప్ 5 రైళ్ల జాబితాలో న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ నాల్గవ స్థానంలో ఉంది. రైలు నంబర్ 12952 ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ 2022-23 సంవత్సరంలో 4,85,794 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. దీని కారణంగా రూ. 1,22,84,51,554 రైల్వే ఖాతాలోకి వచ్చింది.
ఆదాయాల పరంగా, దిబ్రూగర్ రాజధాని దేశంలో ఐదవ అత్యంత లాభదాయకమైన రైలు. ఈ రైలు గత ఏడాది 4,20,215 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చింది. ఈ రైలు రూ.1,16,88,39,769 ఆదాయాన్ని ఆర్జించింది.