Sun Set: వామ్మో.. ఇవెక్కడి దేశాలు బాబోయ్.. 73 రోజుల పాటు పగలే.. రాత్రయ్యే ముచ్చటే లేదు
Countries Where Sun Does Not Rise: సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. పగటిపూట 24 గంటలలో దాదాపు 12 గంటలు పగలు, మిగిలిన సమయం రాత్రిగా ఉంటుంది. అయితే, 70 రోజులకు మించి సూర్యుడు అస్తమించని దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.
Countries Where Sun Does Not Rise: సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. పగటిపూట 24 గంటలలో దాదాపు 12 గంటలు పగలు, మిగిలిన సమయం రాత్రిగా ఉంటుంది. అయితే, 70 రోజులకు మించి సూర్యుడు అస్తమించని దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఈ విషయంపై పర్యాటకులే కాకుండా స్థానికులు కూడా అయోమయం చెందడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భూమిపై సూర్యుడు అస్తమించని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. నార్వే: ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ది మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. మే నుంచి జులై చివరి వరకు ఇక్కడ సూర్యుడు అస్తమించడు. అంటే 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్‌బార్డ్‌లో, ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంటాడు.
2. నునావట్ (కెనడా): ఈ ప్రదేశం ఆర్కిటిక్ సర్కిల్ నుంచి 2 డిగ్రీల ఎత్తులో ఉంది. కెనడాలోని వాయువ్య ప్రాంతంలో ఉంది. ఈ ప్రదేశంలో సూర్యుడు రోజులో 24 గంటలు, వారానికి ఏడు రోజులు, రెండు నెలల పాటు కనిపిస్తుంటాడు. అయితే శీతాకాలంలో 30 రోజుల పాటు చీకటిగా ఉంటుంది.
3. ఐస్లాండ్: ఐరోపాలో గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐస్లాండ్ అతిపెద్ద ద్వీపం. ఈ దేశంలో దోమలు కూడా కనిపించవు. జూన్ నెలలో ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు.
4. బారో, అలాస్కా: మే చివరి నుంచి జులై చివరి వరకు ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు. ఆ తరువాత, నవంబర్ ప్రారంభం నుంచి వచ్చే 30 రోజుల వరకు ఇక్కడ సూర్యుడు ఉదయించడు. దీంతో ఈ ప్రాంతాన్ని పోలార్ నైట్ అంటారు. అంటే చలికాలంలో ఈ దేశం పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోతుంది.
5. ఫిన్లాండ్: వేసవి కాలంలో, ఫిన్లాండ్‌లో వరుసగా 73 రోజుల పాటు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అయితే శీతాకాలంలో సూర్యుడు మాత్రం అస్తమిస్తాడు.
6. స్వీడన్: స్వీడన్‌లో మే ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకు సూర్యుడు అర్ధరాత్రి అస్తమించి తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ ఉదయిస్తాడు. ఈ దేశంలో 6 నెలల పాటు సూర్యుడు నిరంతరం ఉదయిస్తుంటాడు.