సినిమా స్టైల్ దొంగతనం.. కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..

Robbery: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

Update: 2024-05-25 09:02 GMT

సినిమా స్టైల్ దొంగతనం.. కదులుతున్న ట్రక్కు నుంచి దారి దోపిడీ..

Robbery: దేన్నైనా తస్కరించడం ఓ కళ. అందులోనూ దొంగతనం అంటే.. వేరే లెవల్ ఆర్ట్. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్ దొంగతనం. ఇంట్లో దొంగతం.. షాపుల్లో దొంగతనం చూసుంటాం.. కానీ.. రోడ్డుపై వెళ్లే భారీ వాహనాల్లో దొంగతనం చేయటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. రిస్క్ తీసుకోకుంటే.. మిగిలేది రస్క్ అనుకున్నారో ఏమో... ఓ ముగ్గురు కలిసి చేసిన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వేగంగా వెళ్తున్న వాహనాల్లో దోపిడీ చేయటం.. అంతే స్పీడ్ గా మరో వెహికల్ ‌లోకి జంప్ కావడం సినిమాల్లోనే చూస్తుంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఆగ్రా-ముంబై రహదారిపై జరిగింది. దుస్తుల లోడ్‌తో వెళ్తోన్న లారీపైకి ఇద్దరు దొంగలు ఎక్కారు. దుస్తులతో ప్యాక్ చేసిన ఓ పెద్ద బ్యాగును రోడ్డుపై పడేశారు. ఆ లారీ వెనకాలే ఫాలో అయిన మరో దొంగ బైకుతో సిద్ధంగా ఉన్నారు. బ్యాగు పడేసిన తర్వాత వెనకాలే వెళ్లిన బైక్‌పై వెళ్లిన దొంగ వారిద్ధరిని చాకచక్యంగా బైక్‌కి దించుకున్నాడు.. ఇదంతా కేవలం కొన్ని క్షణాల్లోనే జరిగింది.

సినిమా యాక్షన్ సీన్ మాదిరి పని ముగించుకున్నారు ఆ ముగ్గురు దొంగలు. అదే రహదారిపై వెళ్తోన్న మరో వాహనదారుడు వీడియో తీయటంతో.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. దొంగతనాలల్లో ఈ దొంగతనం వేరయ్యా అన్నట్టు వీరి కళ ఉండటంతో.. నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. దీంతోపాటు.. దొంగతనానికి వెళ్తే.. తృటిలో ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందంటూ.. పలువురు సోషల్ మీడియాలో తిట్ల దండకం అందుకుంటున్నారు.  


Tags:    

Similar News