శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం
Sri Lanka Crisis: ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది
Sri Lanka Crisis: పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదివారం తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి శ్రీలంకలో పరిస్థితి, గతంలో ఆ దేశానికి భారత్ అందించిన సహాయంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
పలు రాజకీయ పార్టీల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీలంక సంక్షోభం, శరణార్థుల ప్రవేశంపై తమిళనాడులో ఆందోళన నెలకొన్నది. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఇటీవల జరిగిన సమావేశంలో శ్రీలంకలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.