PM Modi In Kuwait: రామాయణం, మహా భారతంను అరబిక్‌లోకి అనువదించిన వారిని కలిసిన ప్రధాని మోదీ
Ramayana and Mahabharata In Arabic: కువైట్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం నుండి ఘన స్వాగతం లభించింది. ఇవాళ, రేపు మోదీ కువైట్ లో పర్యటించనున్నారు. కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జబర్ అల్-సబ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలోనే కువైట్ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలపై ప్రధాని మోదీ సంతకం చేయనున్నారు.
కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రామాయణం, మహాభారతంను అరబిక్‌లోకి అనువదించి, ప్రచురించిన వారిని కలిశారు. అబ్ధుల్లా బారోన్ రామాయణం, మహాభారతం గ్రంధాలను అరబిక్ లోకి అనువదించారు. అబ్ధుల్ లతీఫ్ అల్నెసిఫ్ ఆ గ్రంధాలను అరబిక్ భాషలో ప్రచురించారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుండి 30 కి పైగా పుస్తకాలను అరబిక్‌లోకి అనువదించి, ప్రచురించారు.