Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో పై అవిశ్వాసం.. ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ ప్రకటన

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)ప్రభుత్వంపై నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (NDP) నాయకులు జగ్మీత్ సింగ్ (Jagmeet Singh) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు.

Update: 2024-12-21 11:17 GMT

Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో పై అవిశ్వాసం.. ఎన్‌డీపీ నేత జగ్మీత్ సింగ్ ప్రకటన

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)ప్రభుత్వంపై నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (NDP) నాయకులు జగ్మీత్ సింగ్ (Jagmeet Singh) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. జగ్మీత్ సింగ్ ఖలీస్తానీ మద్దతుదారు. ఇటీవల జరిగిన విశ్వాస తీర్మానంలో ఎన్ డీ పీ మద్దతుతో ట్రూడో నెగ్గారు.ప్రజల కోసం ట్రూడో పనిచేయడం లేదని జగ్మీత్ సింగ్ చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఎన్ డీ పీ సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో ఈ తీర్మానాన్ని తెస్తామని ఆయన తెలిపారు.

జస్టిస్ ట్రూడో ముందున్న ఆప్షన్స్ ఏంటి?

జస్టిస్ ట్రూడో రాజీనామా చేసే అవకాశం ఉంది. లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ప్రధాని పదవికి ఎన్నుకోవాలి. కొత్త నాయకుడిని ఎన్నుకొనేందుకు ప్రత్యేక కన్వెన్షన్ సమావేశం ఏర్పాటు చేయాలి. ఒకవేళ ప్రత్యేక కన్వెన్షన్ సమావేశం ఏర్పాటు చేస్తే ప్రధాని పదవి నుంచి ఆయన తప్పుకోకపోతే బలవంతంగా ఆయనను తప్పించే అవకాశం ఉంది. ట్రూడో ప్రభుత్వానికి ఎన్ డీ పీ మద్దతును ఉపసంహరించుకుంటే ఇతర పార్టీల మద్దతుతో ఆధారపడే అవకాశం ఉంది. లేదా పార్లమెంట్ ను ప్రోరోగ్ చేయవచ్చు.

ఇదిలా ఉంటేకెనడా ఉప ప్రధాని క్రిస్టియనా ఫ్రిలాండ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆర్ధిక శాఖను ఆమె నుంచి తప్పిస్తానని ట్రూడో ప్రకటించిన తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు.

Tags:    

Similar News