Sunita Williams: సునీతా విలియమ్స్ భూమి మీదకు రావడం మరింత ఆలస్యం?
సునీతా విలియమ్స్ (Sunita Williams ), బచ్ విల్ మోర్ (Butch Wilmore ) టెక్నికల్ సమస్యలతో ఇంకా అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సునీతా విలియమ్స్ (Sunita Williams ), బచ్ విల్ మోర్ (Butch Wilmore ) టెక్నికల్ సమస్యలతో ఇంకా అంతరిక్షంలోనే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2025 మార్చి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే అవకాశం ఉంది.2024 జూన్ నుంచి వీళ్లిద్దరూ అంతరిక్షంలోనే ఉన్నారు.
సునీతా విలియమ్స్ భూమి మీదకు రావడానికి ఎందుకు ఆలస్యం?
సునీతా విలియమ్స్ విల్మోర్ లను భూమి మీదకు తీసుకు రావడానికి స్పేస్ ఎక్స్ క్రూ-9 మిషన్ 2024 సెప్టెంబర్ 29న అంతరిక్షానికి పంపారు. ఈ రాకెట్ లో నిక్ హాగ్వే, అలెగ్జాండర్ గార్జునోవ్ అనే ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్లారు. 2025 ఫిబ్రవరిలో ఈ ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీతా విలియమ్స్, విల్మోర్ లు తిరిగి భూమి మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే అంతరిక్షంలోని నలుగురు వ్యోమగాములు తిరిగి వచ్చేందుకు క్రూ ను సిద్దం చేయడానికి మరింత సమయం పడుతుంది. ఇది మార్చి చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో సునీతా విలియమ్స్ భూమి మీదకు రావడానికి మరింత సమయం పట్టనుంది.
సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎలా చిక్కుకున్నారు?
అంతరిక్షంలోకి మానవసహిత రాకెట్లను పంపడానికి బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ క్యాప్సుల్ తయారు చేసింది. ఇందులో సునీతా విలియమ్స్, విల్మోర్ లు అంతరిక్షంలో 8 రోజులు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా 2024 జూన్ 6న స్టార్ లైనర్ క్యాప్యూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. 8 రోజుల తర్వాత వీళ్లిద్దరూ భూమి మీదకు రావడానికి స్టార్ లైనర్ ను సిద్దం చేస్తున్న క్రమంలో అందులో సాంకేతిక సమస్యలను గుర్తించారు. వీటిని సరిచేయడానికి సమయం పట్టింది. అయితే స్టార్ లైనర్ క్యాప్యుల్ 2024 సెప్టెంబర్ చివర్లో భూమి మీదకు చేరింది. సునీతా విలియమ్స్, విల్మోర్ లు మాత్రం అందులో రాలేదు. ఈ ఇద్దరి కోసం స్పేస్ ఎక్స్ క్రూ ను పంపారు.
మూడుసార్లు అంతరిక్షానికి వెళ్లిన సునీతా విలియమ్స్
2006, 2012, 2024 లలో సునీతా విలియమ్స్ అంతరిక్షానికి వెళ్లారు. 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారు. 322 రోజులు ఆమె అంతరిక్షంలో గడిపారు.