Indian students: కెనడాలో భయాందోళనలో ఇండియన్ స్టూడెంట్స్

Update: 2024-12-14 15:56 GMT

Indian students in Canada to submit documents again: కెనడాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు. వారి ఆందోళనకు కారణం లేకపోలేదు. స్టడీ పర్మిట్, వీసా డాక్యుమెంట్స్, చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్, మార్క్స్ షీట్స్, అటెండెన్స్... ఇలా మీ డాక్యుమెంట్స్ అన్ని మరోసారి సబ్మిట్ చేయండి అని కెనడా ప్రభుత్వం ఆదేశించింది. కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు జారీచేసిన ఈ ఆదేశాలు చూసి కెనడాలో ఎంఎస్ చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.

కెనడాకు వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహారించనున్నట్లు ఇటీవలే కెనడా సర్కారు ప్రకటించింది. ఇదే విషయమై తాజాగా అన్ని యూనివర్శిటీలకు, ఇమ్మిగ్రేషన్ విభాగంలో పేరు నమోదు చేసుకున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు ఈమెయిల్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.

కెనడాలో మాస్టర్స్ చదువుకుంటున్న వారిలో కొందరికి రెండేళ్ల కాలపరిమితి ఉండే వీసాలే ఉన్నాయి. ఇంకొందరికి త్వరలోనే వారి వీసా గడువు ముగిసిపోనుంది. ఇలా కొంతమందికి వీసా పరమైన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వీసాలతో చిక్కులు ఎదురైతే తమ విదేశీ విద్య ఏం కాను అనే టెన్షన్ ఇండియన్ స్టూడెంట్స్‌ను వేధిస్తోంది. 

ముఖ్యంగా వారిపైనే కన్నేసిన కెనడా

ఇప్పటికే వారం రోజుల నుండే ఇండియన్ స్టూడెంట్స్ కు కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ఈమెయిల్స్ రావడం మొదలయ్యాయి. అందులోనూ మరీ ముఖ్యంగా పంజాబ్ నుండి కెనడాకు వచ్చిన స్టూడెంట్స్ పై కెనడా ప్రత్యేక దృష్టిసారిస్తోందని తెలుస్తోంది. ఇంకొంతమందికి ఇమ్మిగ్రేషన్ ఆఫీసుకు వ్యక్తిగతంగా వచ్చి వారి డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందా అనే ఆందోళన, అయోమయం ఇండియన్ స్టూడెంట్స్‌ను వెంటాడుతోంది. ఇండియా-కెనడా మధ్య సంబంధాలు దెన్న తరువాత ఈ ఆందోళన మరీ ఎక్కువైందంటున్నారు కెనడాలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్.

Tags:    

Similar News