Congo: కాంగోలో పడవ బోల్తాపడి 25 మంది మృతి.. మృతుల్లో చిన్నారులు, మహిళలు

Update: 2024-12-18 00:41 GMT

Congo: కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఓ నదిలో పడవ బోల్తాపడిన ఘటనలో 25 మంది మరణించారు. పదుల సంఖ్యలో తప్పిపోయారు. మరణించినవారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి కోసం సెర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

కిన్షాసా రాజధానికి ఈశాన్యంగా ఉన్న ఇనోంగో పట్టణం నుండి బయలుదేరిన తర్వాత నౌకలో 100 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఫిమి నది వెంబడి ప్రయాణిస్తుండగా ఈ పడవ బోల్తా పడింది. పడవ పైకప్పు ఓవర్ లోడ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన 25 మంది డెడ్ బాడీలను నదిలో నుంచి వెలికి తీశారని ఇనోంగో నది కమీషనర్ డేవిడ్ కలేంబా చెప్పారు.

కాగా అక్టోబర్ లో కాంగోలో జరిగిన మరో ప్రమాదంలో 78 మంది మరణించారు. జూన్ లో కిన్హాసా సమీపంలో జరిగిన ప్రమాదంలో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్య ఆఫికన్ దేశంలో ఓవర్ లోడ్ చేసిన పడవలు బోల్తా పడటం తరచుగా జరుగుతోంది. 

Tags:    

Similar News