Donald Trump threatens EU: అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి.. లేదంటే... ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
Donald Trump threatens Europe: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ యురొపియన్ యూనియన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వద్ద ఆయిల్, గ్యాస్ కొనండి... లేదంటే అమెరికా వైపు నుండి అన్నివిధాలుగా సుంకం రూపంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సుంకం అనే మాటను హైలైట్ చేస్తూ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
యురోపియన్ యూనియన్‌లో 27 దేశాలు
యురోపియన్ యూనియన్‌లో ప్రస్తుతం 27 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, గ్రీస్, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, హంగేరీ, ఐర్లాండ్, లాట్వియా, లిత్వేనియా, లక్సెంబర్గ్, మాల్టా, రొమేనియా, స్లోవేనియా వంటి దేశాలు ఆ జాబితాలో ఉన్నాయి.
ట్రంప్ చెబుతున్న వివరాల ప్రకారం అమెరికాతో యూరొపియన్ యూనియన్ దేశాలు వర్తకంలో ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. కానీ ఇకపై అమెరికా నుండి భారీ మొత్తంలో ఆయిల్, గ్యాస్ కొనకుంటే... ఆ తరువాత పర్యావసనాలు సుంకం రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుందని (Buy oil and gas from america or else face TARIFFS) ట్రంప్ నేరుగానే హెచ్చరికలకు దిగడం ప్రస్తుతం చర్చనియాంశమైంది.
డొనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న ప్రమాణస్వీకారం (Donald Trump oath taking ceremony date, time and venue) చేయనున్నారు. కానీ అంతకంటే ముందుగానే రోజుకొక సంచలన ప్రకటన చేస్తూ భవిష్యత్ లో వివిధ దేశాలతో అమెరికా వైఖరి ఎలా ఉండబోతోందనే విషయంలో సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అమెరికాతో సానుకూల సంబంధాలు లేని దేశాలకు ఎగుమతులు, దిగుమతులపై సుంకం పెంచుతామంటూ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్ దేశాలు తీసుకున్న నిర్ణయంపైనా ట్రంప్ ఇలాంటి హెచ్చరికలే చేసిన విషయం తెలిసిందే.