Brazil plane crash: బ్రెజిల్ విషాదం నెలకొంది. ఓ చిన్న విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. పర్యాటక పట్టణమైన గ్రామడోలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..విమానం మొదట ఓ భవనాన్ని ఢీ కొట్టింది. అనంతరం ఇతర ఇళ్లను ఢీ కొడుతూ చివరగా ఫర్నీచర్ దుకాణంలోకి దూసుకెళ్లింది.
అందులో ఉన్న ప్రయాణికులంతా మరణించారు. గ్రామడో పర్వత ప్రాంతంలోని పట్టణం ఇది. ఇక్కడికి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ ఘటనతో అక్కడి జనాలు షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది. వారు రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలోని నగరం నుండి సావో పాలో రాష్ట్రానికి ప్రయాణిస్తున్నారు.
బ్రెజిల్‌లోని సెర్రా గౌచా పర్వతాలలో ఉన్న గ్రామాడో పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. ఈ నగరం చల్లని వాతావరణం, హైకింగ్ గమ్యస్థానాలు, సాంప్రదాయ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ నగరం 19వ శతాబ్దంలో జర్మన్, ఇటాలియన్ వలసదారులచే స్థిరపడింది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది.బ్రెజిల్‌లో ఆదివారం జరిగిన బస్సు ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతంలో ఆగ్నేయ బ్రెజిల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 41కి పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ ప్రమాదాన్ని భయంకరమైన విషాదంగా పేర్కొన్నారు.