Telangana student Suspicious Death in USA : అమెరికాలో హనుమకొండ విద్యార్థి అనుమానాస్పద మృతి

Update: 2024-12-23 04:04 GMT

Telangana student Suspicious Death in USA : అమెరికాలో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆదివారం హన్మకొండ జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి అమెరికాలో అనుమానాస్పదంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు బండి రాజయ్య, లలితల రెండు కుమారుడు వంశీ గతేడాది జులైలో అమెరికాలోని మిన్నెసొటాకు ఎంఎస్ చదివేందుకు వెళ్లాడు. ఈ మధ్యే పార్ట్ టైం ఉద్యోగం చేరాడు.

వంశీ ఉంటున్న అపార్ట్ మెంట్ సెల్లార్ లో పార్కింగ్ చేసిన కారులో వంశీ మరణించినట్లు అదే అపార్ట్ మెంట్లో ఉంటున్న హన్మకొండకు జిల్లాకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి 9.30గంటలకు గుర్తించారు. దీంతో వెంటనే వంశీ కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని అందించారు. వంశీ మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే వంశీ మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

Tags:    

Similar News