ఉక్రెయన్‌లో తెలుగు విద్యార్ధులు.. భయాందోళనలో తల్లిదండ్రులు

ఉక్రెయన్‌లో తెలుగు విద్యార్ధులు.. భయాందోళనలో తల్లిదండ్రులు

Update: 2022-02-25 02:02 GMT

ఉక్రెయన్‌లో తెలుగు విద్యార్ధులు.. భయాందోళనలో తల్లిదండ్రులు

Telugu students in Ukraine: రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఆ దేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు అక్కడ చిక్కకుని బిక్కబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడిన నేపథ్యంలో స్వదేశంలోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల్లో సుమారు 350 మంది వరకు తెలుగువారు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నారు.

మరోవైపు ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. బాంబుల శబ్దాలు, అంబులెన్స్ శబ్దాలు వినబడుతున్నాయని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడంలేదని తెలుగు విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News