Wayanad ByElection: వయనాడ్ బై ఎలక్షన్..వార్ వన్ సైడ్..దూసుకుపోతున్న ప్రియాంక..లక్ష దాటిన ఆధిక్యం.

Priyanka Gandhi: వాయనాడ్ లోకసభ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతన్నారు ప్రియాంక గాంధీ.

Update: 2024-11-23 05:23 GMT

Priyanka Gandhi: బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారు

Priyanka Gandhi: కాంగ్రెస్ జాతీయ నాయకురాలు, వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ లోకసభ స్థానం నుంచి ప్రియాంకగాంధీ పోటీలో నిలిచినప్పటి నుంచి విస్త్రతంగా ప్రచారం చేశారు. సుమారు పదిరోజులు పాటు లోకసభ నియోజకవర్గంలో ఓటర్లను ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేశారు.

కాగా వయనాడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతోపాటు ఇప్పటి వరకు ప్రియాంకగాంధీ ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయకపోవడం ఇక్కడ ఆమెకు ప్లాస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. అందుకే కౌంటింగ్ షురూ అయిన రెండు గంటల్లోనే 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయపథంలో దూసుకెళ్తున్నారు ప్రియాంకగాంధీ. వయనాడ్ లోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా బీజేపీ నవ్య హరిదాస్ అనే మహిళను బరిలోకి దింపింది. ఇక లెఫ్ట్ పార్టీ నుంచి సత్యన్ మోకేరి ప్రత్యర్థిగా నిలబడ్డారు.

తొలిరౌండ్ నుంచి ప్రియాంకగాంధీ లీడ్ లో ఉండటమే కాదు ప్రత్యర్థులు ఎవరు కూడా ఆమెకు పోటీ ఇవ్వకపోవడంతో ఉదయం 10గంటల వరకు సుమారు 85వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఇది కంటిన్యూ చేస్తే వయానాడ్ నుంచి ప్రియాంక సుమారు లక్షన్నర ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. వయనాడ్ లో ప్రియాంకగాంధీ భారీ మెజార్టీతో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రియాంకకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Tags:    

Similar News