Maharashtra Election Results: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు.. ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Maharashtra Election Results: మహారాష్ట్రలో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-11-23 05:53 GMT

Sanjay Raut

Maharashtra Election Results: మహారాష్ట్రలో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఫలితాల్లో ఎన్డీయే కూటమి లీడ్‌లో దూసుకెళ్లడం, బీజేపీ ఒంటరిగానే వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి ప్రజాతీర్పు కాదని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఎన్డీయే గెలుస్తోందని మండిపడ్డారు.

మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని అన్నారు. ఏక్ నాథ్ షిండే వర్గానికి చెందిన అభ్యర్థులు అందరూ ఆధిక్యంలో కొనసాగడంపై సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. బాల్ థాక్రే స్థాపించిన శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేపై మరాఠా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. 

Tags:    

Similar News