Maharashtra Election Results : కౌన్‌ బనేగా మహారాష్ట్ర సీఎం? రేసులో వీళ్లే

Update: 2024-11-23 05:50 GMT

Maharashtra Election Results : మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరు? మహాయుతి అనూహ్య విజయం దిశగా అడుగులు వేస్తూన్న నేపథ్యంలో ఇప్పటికే 210 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యం సాధించింది. బీజేపీ సింగిల్ గా 100 స్థానాలు గెలుపు దిశగా దూసుకుపోతోంది. మూడు పార్టీ మహా యుతి కూటమి నుంచి ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ షురూ అయ్యింది. అయితే బీజేపీ అధిక స్థానాలు గెలవడంతో ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మోదీ చాయిస్ పైన క్లారిటీ వస్తోంది.

ఇక మహా ఎగ్జిట్ పోల్స్ నిజమే అయ్యాయి. మహాయుతి కూటమి ఏకపక్షంగా అధికారంపై అడుగులు వేస్తోంది. బీజేపీ నాయకత్వంలోని మహాయుతి అధికారం పీఠం చేజిక్కించుకునేందుకు చేరువైంది. మహాయుతిలో బీజేపీ అధిక స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీతో పాటుగా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న శివసేన నుంచి షిండే, ఎన్సీపి నుంచి అజిత్ పవార్ పార్టీలు అనూహ్య ఫలితాలను సాధించాయి. దీంతో మహాయుతి నుంచి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలయ్యింది. ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే తిరిగి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని శివసేన నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా కామెంట్స్ షురూ చేశారు. షిండే పాలన, మూడు పార్టీల సమన్వయంతోనే ఈ స్థాయిలో భారీ విజయం సాధించామని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

ఇక అజిత్ పవార్ పేరును ఆ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. బారామతి నుంచి అజిత్ పవార్ భారీ మెజార్టీతో కొనసాగుతున్నారు. పవార్ రాకతోనే మహాయుతికి మంచి స్పందన కనిపించిందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కూటమిగా మూడు పార్టల సమన్వయం ఎన్సీపీ నుంచి వ్యతిరేకించి బయటకు వస్తూనే ఆ పార్టీకి భారీ నష్టం చేసి మహాయుతికి మేలు చేశారని గుర్తు చేస్తున్నారు. గతంలోనే అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పదవిపైన ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం తాము కూటమిలో మెజార్టీ స్థానాలు సాధించడంతో తమకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ధీమాగా ఉంది.

బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండటం ఖాయమనిపిస్తోంది. దీనిలో భాగంగా దేవేంద్ర ఫడ్నీవీస్ కు తిరిగి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ నాయకత్వం కూడా ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో షిండేను ముఖ్యమంత్రి చేసే సమయంలో ఫడ్నవీస్ పార్టీ నాయకత్వానికి పూర్తిగా సహకరించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మూడు పార్టీ సమన్వయం, ఆర్ఎస్ఎష్ తో కో ఆర్డినేషన్ తో పాటుగా ప్రచార వ్యూహాల్లోనూ ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించారు. ప్రధాని మోదీ, అమిత్ షా కూడా ఫడ్నవీస్ పైనా సానుకూలంగానే ఉన్నారు. దీంతో మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖాయంగా కనిపిస్తోంది. 

Tags:    

Similar News