Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో సీఎం కుర్చీ ఎవరిదో చెప్పకనే చెప్పిన దృశ్యం

Update: 2024-11-23 13:55 GMT

Who will be the next CM of Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి కూటమి 236 స్థానాలు గెలుచుకుంది. గతంలో మహారాష్ట్రలో ఏ కూటమి కూడా ఇంత భారీ స్థాయిలో మెజారిటీ దక్కించుకోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఇక ప్రతిపక్ష కూటమి అయిన మహా వికాస్ అఘాడి కేవలం 48 స్థానాలకే పరిమితమైంది. అందులో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీకి 20 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ మరో 15 స్థానాలు, శరద్ పవార్ నేతృత్వంలోని 10 స్థానాల్లో విజయం సాధించాయి. ఇతర మిత్ పక్ష పార్టీలు మరో 3 స్థానాలు గెలుచుకున్నాయి.

Full View

మహాయుతి కూటమి గెలుచుకున్న 233 స్థానాల్లో ఒక్క బీజేపికే 133 స్థానాలొచ్చాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సంఖ్యకు ఇది కొద్దిగానే తక్కువ. పైగా పోటీ చేసిన 149 స్థానాల్లో 133 మంది అభ్యర్థులు గెలవడం బీజేపి సక్సెస్ రేటును అమాంతం పెంచేసింది. మహాయుతి కూటమిలో మిగిలిన రెండు పార్టీల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 57 స్థానాలు, అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలు వచ్చాయి. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బీజేపి మరో 28 స్థానాలు ఎక్కువే గెల్చుకుంది.

6 నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 48 లోక్ సభ స్థానాలకుగాను బీజేపి కేవలం 17 స్థానాల్లోనే విజయం సాధించింది. ఆ లోక్ సభ ఎన్నికల్లో తమ ప్రతిపక్ష కూటమైన మహా వికాస్ అఘాడి కంటే వెనుకబడి రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. కానీ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపి బలం అమాంతం పెరిగిపోయింది. దీంతో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీకే సీఎం సీటు కూడా దక్కనుంది. మహారాష్ట్ర మాజీ సీఎం నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ మరోసారి సీఎం రేసులో ముందంజలో ఉన్నారు.

మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సీఎం ఏక్‌నాథ్ షిండే అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ భేటీ కూటమికి చెందిన ఇతర ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎం ఏక్ నాథ్ షిండె, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇద్దరూ హంగూ ఆర్భాటంతో కూడిన పెద్ద కుర్చీల్లో కూర్చున్నారు. మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, కేంద్ర మంత్రి రాందాస్ అథ్వాలె మిగతా నేతల కోసం ఏర్పాటు చేసిన సాధారణ కుర్చీల్లో కూర్చున్నారు.

నేతల్లో ఎవరికీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ సీటింగ్ అరేంజ్మెంట్‌తోనే తెలిసిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపికి, ఏక్‌నాథ్ షిండేకు మొదటి రెండు ప్రాధాన్యతలు దక్కాయని, 41 స్థానాలు గెలుచుకున్న అజిత్ పవార్ వర్గానికి మూడో ప్రాధాన్యత మాత్రమే దక్కిందని ఈ సీటింగ్ అరేంజ్మెంట్ చెప్పకనే చెబుతోందని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. 

Tags:    

Similar News