ఢిల్లీలోని ఆంధ్రా, తెలంగాణ భవన్‌‌కు రాహుల్ గాంధీ

తెలంగాణ భవన్‌లో భోజనం చేసిన రాహుల్

Update: 2024-05-23 13:05 GMT

ఢిల్లీలోని ఆంధ్రా, తెలంగాణ భవన్‌‌కు రాహుల్ గాంధీ

ఢిల్లీలోని తెలంగాణ, ఆంధ్రా భవన్‌కు అనుకోని ఓ అతిథి వచ్చాడు. సడెన్ గా అక్కడ ప్రత్యక్షం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆ వీఐపీ గెస్ట్. తెలంగాణ, ఆంధ్రా భవన్‌ మొత్తం కలియ తిరిగి.. కాసేపు అక్కడే గడిపారు. అంతేకాదు తెలంగాణ భవన్‌ క్యాంటీన్‌లోనే ఓ సాధారణ వ్యక్తిగా భోజనం చేశారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సరదాగా ముచ్చటించి.. వారితో సె‌ల్పీ‌లు కూడా దిగారు. ఇంతకు ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా..? ఆయనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్న రాహుల్.. సడెన్ గా ఆంధ్రా, తెలంగాణ భవన్‌ను సందర్శించి.. అందరికీ షాక్ ఇచ్చారు.

అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒంటరి ప్రయాణాలు చేయడం, సెడన్‌గా ఎక్కడో తేలి.. సామాన్యులను కలిసి వారి సమస్యల గురించి ఆరా తీయడాలు చేస్తుంటారు రాహుల్. తాజాగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన.. ఉన్నట్టుండి ఆంధ్రా, తెలంగాణ భవన్‌ను సందర్శించారు. కాసేపు భవనం మొత్తం కలియ తిరిగి.. అక్కడే క్యాంటీన్‌లో భోజనం కూడా చేశారు. రాహుల్ వెంట కేసీ వేణుగోపాల్,, ఇతర కాంగ్రెస్ ముఖ్యులు కూడా ఉన్నారు. రాహుల్ రావడంతో.. ఆంధ్రా, తెలంగాణ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఫుల్ ఖుషీ అయ్యారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. రాహుల్ కూడా వారితో కలిసి పోయి.. సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో ఇంత బిజీగా ఉండి కూడా సాధారణ వ్యక్తిగా తెలంగాణ భవన్‌కు రావడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది.

తెలంగాణ భవన్‌ నుంచి బయటకు వచ్చాక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు కొందరికి షాకిస్తాయని, బీజేపీ నేతలను ఉద్దేశించి రాహుల్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా కూటమి అనుకున్న దాని కంటే ఎక్కువగానే సీట్లు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేడు రాజ్యాంగాన్నే మార్చేస్తానంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని ఆరోపించారు. నిరుపేదల అస్తిత్వాన్ని కాపాడే రిజర్వేషన్లను కూడా తీసివెస్తామంటున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలో నిరుపేదలకు ఒరిగిందేమి లేదని, దేశం సంపదనంతా అదానీకే దోచి పెడుతున్నాడని ధ్వజమెత్తారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతోందిని రాహుల్ అన్నారు.

Tags:    

Similar News