Pune Porsche Crash: పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌నే మార్చేసిన వైద్యులు

Pune Porsche Crash: పుణెలో ర్యాష్‌ డ్రైవింగ్‌‌ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇద్దరు టెకీల మృతికి కారణమైన నిందితుడి మైనర్ బ్లడ్ శాంపిల్స్‌ను మార్చే ప్రయత్నం చేశారు డాక్టర్లు.

Update: 2024-05-27 07:59 GMT

Pune Porsche Crash: పుణె ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. నిందితుడి బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌నే మార్చేసిన వైద్యులు

Pune Porsche Crash: పుణెలో ర్యాష్‌ డ్రైవింగ్‌‌ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇద్దరు టెకీల మృతికి కారణమైన నిందితుడి మైనర్ బ్లడ్ శాంపిల్స్‌ను మార్చే ప్రయత్నం చేశారు డాక్టర్లు. విచారణలో ఈ విషయాన్ని గుర్తించిన డాక్టర్లు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడి రక్త నమూనాలు తీసుకుని.. అందులో ఎలాంటి ఆల్కహాల్ ఆనవాళ్లు లేవని సాసూన్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ అజేయ్‌ తావ్‌రే, డాక్రట్ శ్రీహారి రిపోర్టు ఇచ్చారు. అయితే విచారణ సమయంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా నిందితుడు మిత్రులతో కలిసి మద్యం తాగినట్లు గుర్తించారు పోలీసులు. వెంటనే డాక్టర్లను అదుపులోకి తీసుకొన్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.

నిందితుడి తండ్రి నగరంలో బడా రియల్టర్. కేసును తప్పుదోవ పట్టించి మైనర్‌ను రక్షించేందుకు తీవ్ర యత్నాలు చేశారు. తమ డ్రైవర్‌ను కేసులో ఇరికించేందుకు నిందితుడి కుటుంబసభ్యులు తీవ్ర స్థాయిలో యత్నించినట్లు గుర్తించారు పోలీసులు. కొందరు పోలీసులను కూడా నిందితుడి తండ్రి ప్రభావితం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరు అధికారులపై వేటువేశారు. ఇప్పుడు తాజాగా ఫోరెన్సిక్‌ పరీక్షలు చేసే వైద్యులు కూడా రక్తనమూనాలను తారుమారు చేయడానికి యత్నించినట్లు తేలింది. 

Tags:    

Similar News