నేడు రేవ్‌ పార్టీ నిందితుల విచారణ.. నటి హేమ సహా 8 మందికి నోటీసులు

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Update: 2024-05-27 05:05 GMT

నేడు రేవ్‌ పార్టీ నిందితుల విచారణ.. నటి హేమ సహా 8 మందికి నోటీసులు

Bengaluru Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్ట్ అయిన ఆరుగురిలో ఐదుగురి బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో పెద్దమొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఖాతాలకు బదిలీ అయిన నగదు వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు.

జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103మంది పాల్గొనగా... వారిలో 86మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వారిలో నటి హేమతో కలిపి 8మందిని నేడు విచారణకు రావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Tags:    

Similar News