మధ్యప్రదేశ్‌లో డాక్టరైన పోలీస్ అధికారిణి..!
* గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి CPR చికిత్స.. కోలుకున్న వ్యక్తి.. ఆస్పత్రికి తరలింపు
Madhya Pradesh: పోలీసులు అనగానే ఖాకీ గుర్తుకు వస్తుంది.. వారు చాలా కఠినంగా ఉంటారని స్ఫురిస్తుంది.. కానీ వాళ్లలో కూడా మంచి మనసున్న వాళ్లుంటారు అని నిరూపించారు ఓ పోలీస్ అధికారిణి. మధ్య ప్రదేశ్ గ్వాలియర్‌లో గోలికి మందిర్ దగ్గర డ్యూటీలో సమీపంలో ఓ వ్యక్తి స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం రావడంతో హుటాహుటిన వెళ్లింది.. వెంటనే ఆ వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించడంతో గండం గడిచింది.. కోలుకున్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమయానికి స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ అధికారిణిని అందరూ అభినందిస్తున్నారు. ట్రైనింగ్‌లో నేర్పిన CPR చికిత్సా విధానం ఇప్పుడు ఇలా పనికి వచ్చిందని పోలీస్ అధికారిణి ఆనందం వ్యక్తం చేశారు.