PM Kisan: ఐదెకరాలలోపు ఉన్న రైతులకు గుడ్న్యూస్..వారి అకౌంట్లోకి ఏకంగా రూ. 31వేలు..పూర్తి వివరాలివే
PM Kisan: మనదేశం వ్యవసాయాధారిత దేశం. ఇది చిన్నప్పటి నుంచి మనం చేదుకుంటూనే ఉన్నాం. నాటి నుంచి నేటి వరకు చాలా మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంలో సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ మంచి రాబడిని పొందుతున్నారు రైతులు. పునాస పంటల నుంచి వరి, చెరుకుతోపాటు రకరకాల ఉద్యానవనాలు సాగు చేస్తూ దేశానికి వెన్నుముకగా నిలుస్తున్నారు రైతన్నలు.

అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా వ్యవసాయానికి ప్రాధాన్యంత ఇస్తుంటాయి. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వంటి స్కీములను ప్రారంభించింది. దీని ద్వారా ఏడాదికి రూ. 6వేలు రైతులకు పెట్టుబడి సాయం కింద అందిస్తుంది.ఇటు తెలంగాణలోనూ ప్రతి ఏడాది ఎకరానికి రూ. 15వేల చొప్పున రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. మొన్నటి వరకు రైతు బంధు కింద ఎకరానికి రూ. 10వేలు అందించిన ప్రభుత్వం ఈ సీజన్ నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 15వేలు అందిస్తుంది.
దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ. 25వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. రెండు ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్లో రూ. 10వేలు, 4 ఎకరాలు ఉన్న రైతులకు రూ. 20వేలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు రూ. 25వేలు జమ చేయనుంది.
దీనిలో భాగంగానే కిసాన్ ఆశీర్వాద్ స్కీంను ప్రవేశపెడుతున్నారు. వీటితోపాటు ఐదు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వచ్చే రూ. 6వేలతో కలుపుకుంటే మొత్తం 31 వేలు రైతులకు అందుతుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఈ మొత్తాన్ని అందించనుంది. పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు 17 విడతలుగా డబ్బు పంపిణీ చేశారు. 18వ విడత రూ. 2వేల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.