TOP 6 News @ 6 PM: కాకినాడ పోర్టు పై సీఐడీ విచారణకు చంద్రబాబు యోచన: మరో 5 ముఖ్యాంశాలు

కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణలపై సీఐడీ విచారణ జరిపిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.

Update: 2024-12-03 12:30 GMT

TOP 6 News @ 6 PM: కాకినాడ పోర్టు పై సీఐడీ విచారణకు చంద్రబాబు యోచన: మరో 5 ముఖ్యాంశాలు

1. కాకినాడ పోర్టు పై సీఐడీ విచారణకు చంద్రబాబు యోచన

కాకినాడ పోర్టు, సెజ్ ఆక్రమణలపై సీఐడీ విచారణ జరిపిద్దామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై ఆయన చర్చించారు.కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు.కాకినాడ సెజ్ ను కూడా లాగేసుకున్నారన్నారు.కాకినాడ పోర్టులో కేవీరావుకు 41 శాతం వాటా ఇచ్చి 59 శాతం అరబిందో వాళ్లకు కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు. ఆస్తులు లాక్కోవడం వైసీపీ హయంలో ట్రెండ్ గా ఉందన్నారు.ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలా ఆస్తులు లాక్కోవడం చూడలేదని సీఎం చెప్పారు.

వ్యవస్థలను జగన్ బాగా డ్యామేజీ చేశారన్నారు.తప్పులు చేసి ఇప్పుడు ఆయనే అరుస్తున్నారని జగన్ పై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజల స్పందనను ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 12కు ఆరు నెలలు అవుతోంది.. ఎవరేవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం మంత్రులను ఆదేశించారు.

2. ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత: ఆసుపత్రిలో చికిత్స

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఠానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గొంతు నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.లౌస్వాదీ ఏరియాలోని సుభదీప్ బంగ్లాలో ఆయన ఉంటున్నారు. తాను నివాసానికి సమీపంలోని లక్ష్మీనగర్ లో ఉన్న జ్యుపిటర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రికి వెళ్లే ముందు మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అంతా ఒకేనని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆసుపత్రిలో పరీక్షలు పూర్తైన తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

3. తాజ్ మహల్ ను పేల్చివేస్తామని బెదిరింపులు

తాజ్ మహల్ ను పేల్చివేస్తామని బెదిరింపు ఈ మెయిల్ మంగళవారం అధికారులు వచ్చింది. అయితే ఈ మెయిల్ ఫేక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి ఖాతా నుంచి ఈ మెయిల్ వచ్చింది.తాజ్ మహల్ నుపేల్చివేస్తామనేది ఈ మెయిల్ సారాంశం. ఈ మెయిల్ రాగానే తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో డాగ్ స్వ్కాడ్, బాంబు స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేశారు.కానీ, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ మెయిల్ ను ఎవరు పంపారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

4. బంగ్లాదేశ్ లో ఘటనల వెనుక యూనుసే: షేక్ హసీనా

బంగ్లాదేశ్ లో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారు. తమ దేశంలో చోటు చేసుకున్న హత్యలు, తాజా అనిశ్చితికి తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనసే కారణమని ఆమె ఆరోపించారు. న్యూయార్క్ లో జరిగిన అవామీ లీగ్ కార్యక్రమంలో ఆమె వర్చువల్ గా పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఆందోళనలకు కుట్ర పన్నిందే యూనస్ అని ఆమె చెప్పారు. ఇప్పుడు బంగ్లాలో పలువురిపై దాడులు జరుగుతున్నాయన్నారు. తన తండ్రి తరహాలోనే తనను హత్య చేసేందుకు కుట్రలు చేశారని ఆమె ఆరోపించారు.

5. హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు

హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగళవారం కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఈ ఏడాది నవంబర్ 18న విచారణ నిర్వహించారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, తన డ్రైవర్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.తనను అప్పట్లో ఇంటలిజెన్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావు బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎన్ని కేసులు నమోదు చేసినా ప్రశ్నిస్తూనే ఉంటా.. హరీష్ రావు

తనపై ఎన్ని కేసులు నమోదైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని హరీష్ రావు చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదు కావడంపై ఎక్స్ లో ఆయన స్పందించారు. తప్పు చేసి దబాయించడం.. తప్పుడు కేసులు పెట్టడమే సీఎంకు చేతనైందని ఆయన విమర్శించారు. దేవుళ్లను దగా చేశారని అన్నందుకు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో, ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నందుకు బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారని ఆయన అన్నారు.

6. భారత సైన్యం అమ్ముల పొదిలో సరికొత్త డ్రోన్ నాగాస్త్ర

భారత సైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రం చేరింది. ఆత్మాహుతి డ్రోన్ గా పిలిచే నాగాస్త్ర-1 సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. రాత్రిపూట కూడా కచ్చితమైన దాడులు జరిపే 480 నాగాస్త్ర-1 ఆయుధాలు భారత సైన్యంలో చేరాయి. నాగపూర్ కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వీటిని భారత ఆర్మీకి అందించింది. జీపీఎస్ ఆధారంగా నాగాస్త్ర-1 డ్రోన్లు కచ్చితత్వంతో దాడి చేస్తాయి.

Tags:    

Similar News