Petrol Diesel Price Drop: వాహనదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజీల్ ధరలు..ట్యాక్స్ తగ్గించిన కేంద్రం
Petrol Diesel Price Drop: దేశప్రజలకు భారీ శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే డీజీల్, పెట్రోల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో వాహనదారులు పండగ చేసుకుంటారు.పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం ఊహించని విధంగా పన్నును తొలగించింది.
అనేక నెలల చర్చల తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), ముడి చమురు ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై భారీగా పన్నును తగ్గించింది ప్రభుత్వం. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య రిలయన్స్, ONGC వంటి చమురు ఎగుమతి కంపెనీలకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ నిర్ణయం వారి స్థూల రిఫైనింగ్ మార్జిన్‌ను పెంచవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
2022 జులై 1 నుంచి కేంద్రం పెట్రోల్, డీజీల్, ఏవీయేషన్ టర్బైన్ ఫ్యూయల్ , క్రూడ్ ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై విండ్ ఫాల్ టాక్స్ ను అమలు చేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగి, కంపెనీలకు అధిక లాభాలు వస్తుండటంతో ఈ ట్యాక్స్ అమలు చేయడం ప్రారంభించారు. రెండు వారాల సగటు చమురు ధరల కారణంగా ఈ ట్యాక్స్ రేట్లు ప్రతి 15రోజులకు సవరించేవారు.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 72 నుంచి 75 మధ్య ట్రేడ్ అవుతుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గుదల ద్రుష్ట్యా కేంద్రం విండ్ పాల్ ట్యాక్స్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న రోడ్డు, ఇన్ ఫ్రాస్ట్రక్చర సెస్ ను కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం తర్వాత, సోమవారం మధ్యాహ్నం 1.04 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గ్రీన్‌లో రూ.1,300.05 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కాకుండా, పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ (RIC)ని కూడా ఉపసంహరించుకుంది. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సెప్టెంబర్‌లో, భారత ప్రభుత్వం ఆగస్టులో టన్నుకు రూ. 1,850 నుండి ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్నును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఎగుమతులపై విండ్ ఫాల్ పన్నులు కూడా తొలగించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, క్రెమ్లిన్‌పై పాశ్చాత్య ఆంక్షల ప్రారంభంలో, ముడి చమురు ధరల పెరుగుదల చమురు కంపెనీలకు భారీ లాభాలకు దారితీసింది. ఈ లాభాలు చమురు కంపెనీలు పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించే వాతావరణాన్ని సృష్టించాయి. ఈ అసాధారణ లాభాల దృష్ట్యా, దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులపై విండ్‌ఫాల్ పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.