Eknath Shinde: ఏక్ నాథ్ షిండేకు అస్వస్థత
Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఠానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
Eknath Shinde: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఠానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. గొంతు నొప్పి కారణంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.లౌస్వాదీ ఏరియాలోని సుభదీప్ బంగ్లాలో ఆయన ఉంటున్నారు. తాను నివాసానికి సమీపంలోని లక్ష్మీనగర్ లో ఉన్న జ్యుపిటర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు.
ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రికి వెళ్లే ముందు మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అంతా ఒకేనని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆసుపత్రిలో పరీక్షలు పూర్తైన తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.