New Disease Detected In Children: పిల్లల్లో కరోనాతో పాటు మరో వైరస్
New Disease Detected In Children: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 15,424,595మందికి కరోనా వైరస్ బారిన పడగా, దాదాపు 631,238 మంది మరణించారు.
New Disease Detected In Children: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 15,424,595మందికి కరోనా వైరస్ బారిన పడగా, దాదాపు 631,238 మంది మరణించారు. ఈ మహమ్మారి ప్రభావం భారత్‌లోనూ.. ఎక్కువగానే ఉంది. మన దేశంలో దాదాపు 1,257,828 మందికి కరోనా వైరస్ సోకింది. కాగా దాదాపు 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. తాజాగా మరో వార్త తీవ్ర కలవర పెడుతోంది. కొత్త రకం కరోనా కేసులు నమోదౌతున్నాయి. ముంబైలో డియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్.. అనే కొత్త రకమైన రోగంతో పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదవుతున్నట్టు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా ముంబైలో కోవిడ్-19 కి గురైన సుమారు 100 మంది పిల్లల్లో 18 మందికి పేడియాట్రిక్ మల్టీ సిస్టం ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ (పీఎంఐఎస్) అనే వ్యాధి సోకినట్టు తెలిపారు. జపాన్ కు చెందిన తొమిస్కు కవాసాకి అనే పిల్లల వ్యాధి నిపుణుడు మొదట ఈ డిసీజ్ ని కనుగొన్నాడట.అందువల్ల దీన్ని 'కవాసాకి డిసీజ్' అని కూడా వ్యవహరిస్తున్నారు.
జ్వరం, స్కిన్ రాష్, కళ్ళు ఎర్రబడడం, డయేరియా లక్షణాలతో కూడిన ఈ వ్యాధికి వెంటనే చికిత్స లభించకపోతే అత్యంత ప్రమాదకరమని ముంబైలోని వాడియా ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే నగరంలో ఈ వ్యాధికి గురై ఇద్దరు పిల్లలు మరణించినట్టు వారు చెప్పారు. 10 నెలల వయస్సు నుంచి 15 ఏళ్ళ లోపు పిల్లలకు ఇది సోకుతోందట. జూన్ నుంచి ఈ వ్యాధి తాలూకు కేసులు బయట పడుతున్నాయని, చెన్నై, ఢిల్లీ, జైపూర్ నగరాల్లో కూడా కొందరు పిల్లలకు ఈ వ్యాధి సోకినట్టు తెలిసిందని ఈ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.