Google Maps: గుడ్డిగా నమ్మితే నిండా ముంచేసింది.. మ్యాప్స్‌ కారణంగా ముగ్గురు మృతి..!

GPS Navigation: గూగుల్ మ్యాప్స్‌ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-11-25 06:36 GMT

Google Maps: గుడ్డిగా నమ్మితే నిండా ముంచేసింది.. మ్యాప్స్‌ కారణంగా ముగ్గురు మృతి..!

GPS Navigation: గూగుల్ మ్యాప్స్‌ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏదైన కొత్త ప్రదేశానికి వెళ్తే చాలు ముందు మ్యాప్స్‌ ఓపెన్‌ చేయడం కామన్‌గా మారింది. అయితే మార్గాన్ని చూపించడంలో సహాయం చేస్తున్న మ్యాప్స్‌ అదే స్థాయిలో ప్రమాదాలను సైతం తెచ్చి పెడుతోంది. గూగుల్‌ మ్యాప్స్‌ కారణంగా చెరువుల్లోకి, చెట్లలోకి వెళ్లిన సంఘటనలు ఇప్పటి వరకు చూసి ఉంటాం. కానీ తాజాగా ఏకంగా ముగ్గురు ప్రాణాలను బలిగొంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నిన్న (ఆదివారం ) ముగ్గురు వ్యక్తులు బంధువుల వివాహానికి వెళ్తున్నారు. అదే సమయంలో దారి కోసం మ్యాప్స్‌ ఆన్‌ చేసుకున్నారు. అలాగే ఓ బ్రిడ్జిపై రయ్యిమంటూ దూసుకుపోతున్నారు. అయితే ఆ బ్రిడ్జి సగం నిర్మాణం మాత్రమే ఉంది. అప్పటికే వేగంగా ఉండడం, పొగ మంచు ఉన్న కారణంతో కారు డ్రైవర్‌ ఆ విసయాన్ని గమనించలేదు. దీంతో రయ్యిమని దూసుకెళ్లి బ్రిడ్జిపై నుంచి పడిపోయారు.

అంత ఎంతు నుంచి కారు పడిపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం దాటికి కారులో ఉన్న ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. బాధితులు బదౌన్ జిల్లాలోని బరేలీ నుంచి డేటాగంజ్‌కు ప్రయాణిస్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో కారును బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

జీపీఎస్‌ నావిగేషన్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జ్‌ కొట్టుకుపోయిందని, ఇది మ్యాప్స్‌లో అప్‌డేట్‌ కారణంగా వారు అటుగా వచ్చారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో రోడ్డుపై మంచు కూడా ఉండడం ప్రమాదానికి ఒక కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News