Breaking News: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా..!

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు.

Update: 2024-11-26 06:02 GMT

Breaking News: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా..!

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. గవర్నర్ రాధాకృష్ణన్ కు షిండే తన రాజీనామా లేఖను అందించారు.దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి ఆయన రాజీనామా సమర్పించారు.షిండే రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఏక్ నాథ్ షిండేను గవర్నర్ కోరారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఈ కూటమి తరపున సీఎం అభ్యర్ధి ఎవరనే విషయమై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శివసేన (షిండే) వర్గం నుంచి ఏక్ నాథ్ షిండే, బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్ సీ పీ (అజిత్ పవార్ ) వర్గం నుంచి అజిత్ పవార్ లు సీఎం పదవి విషయమై చర్చలు జరిపేందుకు దిల్లీకి చేరుకున్నారు.

సీఎం పదవి, మంత్రివర్గం కూర్పు, మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు కట్టబెట్టాలి... ఏ ఏ శాఖలు ఇవ్వాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయి. షిండే వర్గానికి శివసేనకు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందులో కీలకమైన శాఖలను కేటాయించే అవకాశం ఉంది. అజిత్ పవార్ ఎన్ సీ పీకి 10 మంత్రి పదవులు కేటాయించనున్నారు. 21 మంత్రి పదవులను బీజేపీ తీసుకునే అవకాశం ఉంది. హోం, ఫైనాన్స్, అర్బన్ డెవలప్ మెంట్, రెవిన్యూ వంటి శాఖలను బీజేపీ తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News