Uddhav to Eknath Shinde: ఇక నీ పని అంతే.. ఏక్‌నాథ్ షిండెపై ఉద్ధవ్ థాకరే సెటైర్లు
Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో 235 స్థానాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది. అందులో ఒక్క బీజేపినే 132 స్థానాల్లో జండా ఎగరేసింది. రెండో స్థానంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ సేనకు 57, మూడో స్థానంలో అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలొచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ ఉద్ధవ్ థాకరే ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండేపై కామెంట్స్ చేశారు. ఇకపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని.. అప్పుడు మళ్లీ మీరు ఫడ్నవిస్ కిందే పని చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
బాల్ థాకరే స్థాపించిన శివసేన పార్టీలోంచి ఏక్‌నాథ్ షిండే బయటికొచ్చేటప్పుడు పలు ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ థాకరే కింద పనిచేయలేనని అన్నారు. అందుకే ఆ పార్టీలో ఇక కొనసాగలేనని థాకరే స్థాపించిన శివసేన లోంచి బయటికొస్తూ ఇంకొంతమంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొచ్చారు. బీజేపి, అజిత్ పవార్ వర్గంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. తాజాగా ఉద్ధవ్ థాకరే వర్గం కూడా ఆనాటి షిండే వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇకపై ఫడ్నవిస్ కిందే పనిచేయాల్సి ఉంటుందని అంటున్నారు.