NCLT Recruitment 2021: 'లా' విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగం సంపాదించే అవ‌కాశం..

* నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) లా గ్రాడ్యుయేట్ల కోసం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది.

Update: 2021-10-25 13:15 GMT

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఫైల్ ఫోటో) 

NCLT Recruitment 2021: మీరు 'లా' చదివినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం వ‌చ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) లా గ్రాడ్యుయేట్ల కోసం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది. ఎల్‌ఎల్‌బి అభ్యసించే ఫ్రెషర్ అభ్యర్థులు, అనుభవజ్ఞులైన యువత కోసం ఈ నియామ‌కాలు జ‌రుగుతాయి. NCLT అధికారిక వెబ్‌సైట్ nclt.gov.in లో నోటిఫికేషన్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్ర‌మే ఈ ఉద్యోగాల‌కు ఎంపిక చేస్తారు. ఈ నియామకాల‌ ప్రక్రియ దేశంలోని 8 వేర్వేరు నగరాల్లో జ‌రుగుతుంది. ఏ నగరంలో ఎన్ని పోస్టులను రిక్రూట్ చేస్తారో తెలుసుకోండి.

1. పోస్ట్ పేరు - లా రీసెర్చ్ అసోసియేట్

2. పోస్టుల సంఖ్య - 27

3. జీతం - నెలకు 40 వేల రూపాయలు

4. న్యూఢిల్లీ - 03 పోస్ట్లు

5. ముంబై - 08 పోస్టులు

6. కోల్‌కతా - 03 పోస్టులు

7. హైదరాబాద్ - 04 పోస్టులు

8. అలహాబాద్ - 02 పోస్టులు

9. గౌహతి - 01 పోస్ట్

10. కటక్ - 03 పోస్టులు

11. అమరావతి - 03 పోస్టులు

ఈ అర్హతలు కలిగి ఉండాలి భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ. ఇటీవల LLB చివరి సంవత్సరం పరీక్షలో ఉత్తీర్ణులైతే కూడా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎల్‌ఎల్‌బి డిగ్రీ తర్వాత ఈ రంగంలో పని అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) లో నమోదు చేసుకోవడం తప్పనిసరి.ఈ ప్రభుత్వ ఉద్యోగానికి మీ వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. మీ పుట్టిన తేదీ 01 నవంబర్ 2021 వరకు వయస్సు లెక్కిస్తారు.

ఎంపిక ప్రక్రియ - ఈ రిక్రూట్‌మెంట్‌ కోసం రాత పరీక్ష జ‌రుగ‌దు. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ న్యూఢిల్లీలో జరుగుతుంది.

Tags:    

Similar News