No Lockdown: లాక్‌డౌన్ పెట్టలేం.. అది రాష్ట్రాలే తేల్చుకోవాలి: కేంద్రం
No Lockdown: కరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిల్లాడిపోతోంది. ఓవైపు కేసులు భారీగానే పెరిగిపోతున్నాయి.
No Lockdown: కరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిల్లాడిపోతోంది. ఓవైపు కేసులు భారీగానే పెరిగిపోతున్నాయి. మరోవైపు మరణాలు కూడా అదుపుతోకి రావడంలేదు. దీంతో ఏంచేయాలో తెలియక తలలు పట్టుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కోవిడ్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతుంది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలం అవుతున్నాయి ప్రభుత్వాలు. దేశంలో కోవిడ్ కట్టడికి లాక్‌డౌనే సరైన నిర్ణయం అని సుప్రీంకోర్టుతో సహా పలువురు ప్రముఖులు, సర్వేలు తెలియజేస్తున్నాయి. కాగా, లాక్‌డౌన్ కి బదులు రాత్రి కర్ఫ్యూ విధించాయి పలు రాష్ట్రాలు. కానీ, వీటితో ఏం ప్రయోజనం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్రం పలు కీలక సూచనలు చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించలేమని తేల్చి చెప్పింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇక ఇప్పటికే కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు వారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పాక్షిక లాక్‌డౌన్ అమలుచేయనున్నారు. మరి తెలంగాణాలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో.