PM Kisan Yojana: రైతు సంక్షేమం కోసం ఎన్ని పథకాలను ప్రవేశపెడుతున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కిసాన్ స్కీముపై కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో రైతులకు మరింత లబ్ది చేకూరనుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం..ఇందులో భాగంగానే రైతులు ఆర్థికంగా బలంగా ఉండేందుకు పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది మోదీ సర్కార్.
2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా దేశంలోని అర్హులైన రైతులందరికీ పంటసాయం కింద సంవత్సరానికి 6వేల రూపాయలు అందిస్తోంది. దీంతో ఈ స్కీముపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ యోజన స్కీముకు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ స్కీము కింద రైతులకు మరింత లబ్ది చేకూరే విధంగా కొత్త ప్లాన్ రెడీ చేసిందట మోదీ సర్కార్. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సాయాన్ని పెంచాలన్న ఆలోచనతో అందుకు కసరత్తులు ప్రారంభించిందట.
పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని రూ. 6వేల నుంచి 10వేలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్న చర్చ జనాల్లో నడుస్తోంది. ఫిబ్రవరి 1, 2025న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ లో ఈ నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఇస్తున్న 6వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తోంది ప్రభుత్వం. ఏప్రిల్, జులై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో ప్రతి విడతలో ఎకరానికి 2వేల రూపాయల చొప్పున ఈ ఆర్ధిక సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 18 విడతల డబ్బు విడుదలచేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. 19వ ఇన్ స్టాల్ మెంట్ 2025 ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.