Top 6 News @ 6PM: ఫార్మూలా-ఈ రేసు కేసులో ఈడీ విచారణపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరో 5 ముఖ్యాంశాలు
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ ల తయారీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో ఈడీ విచారణపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నెల ఈడీ విచారణకు తాను హాజరు కావాలో వద్దో న్యాయవాదులు నిర్ణయిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బుధవారం ఆయన తెలంగా భవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు.ఫార్ములా -ఈ కారు కేసులో (Formula E Car race Case) పసలేదన్నారు. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.ఈ కేసుతో తనను అరెస్టు చేసేందుకు ఆరో ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు.ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు.. కేసులో పసలేదని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని ఆయన తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR)లో రూ. 12 వేల కోట్ల స్కాం జరగబోతోందని ఆయన ఆరోపించారు. పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి కాంగ్రెస్ నేతలు దిల్లీకి పంపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
మేడ్చల్, శామీర్ పేటకు మెట్రో పొడిగింపు
హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ ల తయారీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్ లను సిద్దం చేసి మెట్రో రైలు ఫేజ్ 2 బిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపాలని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్ వీఎస్ రెడ్డిని ఆదేశించారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్ బండ్, బోయిన్ పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కి.మీ. కారిడార్ ఉంటుంది.
అధికారులను జగన్ బురదలో తోశారు: చంద్రబాబు
అమరావతి నిర్మాణం పూర్తైతే ఏపీలో సినిమాలు నిర్మించేందుకు అవకాశం ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. సినిమాలకు హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కల్పించిన అవకాశాల కారణంగానే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగిందన్నారు. గత ఐదేళ్లు ప్రజలు పడిన ఇబ్బందులకు 2024 చరిత్ర తిరగరాసిందని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనితీరు మార్చుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారని.. చివరకు వారిని కూడా బురద గుంతలో తోసేశారని ఆయన విమర్శించారు.
పీఎం ఫసల్ భీమా యోజనకు రూ.69,515 కోట్లు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
ఫసల్ భీమా యోజన (PMFBY)కు కేటాయింపులను రూ.69,515 కోట్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు మరింత రక్షణ లభించడంతో పాటు నష్టాల పట్ల ఆందోళన తగ్గనుంది. 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1350 చొప్పున రైతులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను రూ. 3850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగించనున్నారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. 2025 తొలి కేబినెట్ భేటిని రైతులకు అంకితం చేసినట్టు ఆయన చెప్పారు.పంటల భీమా పథకాల అమలులో టెక్నాలజీని వినియోగించుకునేందుకు రూ. 824.77 కోట్ల కార్పస్ ప్రత్యేక నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అమెరికాలో వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి
అమెరికాలోని లూసియానాలోని న్యూ ఆర్లీన్స్ లో జరిగిన ప్రమాదంలో 10 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారు. అంతేకాదు వాహనం నడిపిన వ్యక్తి జనంపై కాల్పులకు దిగారు. న్యూ ఆర్లీన్స్ లో కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడలిలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సమయంలో వేగంగా వచ్చిన వాహనం జనంపైకి దూసుకువచ్చింది.
రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల విచారణకు హాజరైన పేర్ని నాని
పేర్ని జయసుధ(Perni Jayasudha) మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ (Machilipatnam Police station) కు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో విచారణకు రావాలని జయసుధకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య యసుధకు చెందిన గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయమైంది. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు.