2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందో లేదో? సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Sanjay Raut: 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తంచేశారు.

Update: 2025-01-02 12:07 GMT

Sanjay Raut: 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తంచేశారు. సంజయ్ రౌత్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేరు అనే సందేహం కలుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వంలో అస్తిరత ఏర్పడితే మహారాష్ట్రలో కూడా ఆ ప్రభావం కనిపిస్తోందన్నారు.

మరోవైపు ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీకి చెందిన రాజన్ సాల్వీ పార్టీ నుంచి వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సంజయ్ రౌత్.. దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతోనే అనేక మంది ఇతర పార్టీలోకి వెళ్తుంటారని చెప్పారు. అలాగే దర్యాప్తు సంస్ధలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీని నిర్మించేందుకు యత్నిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. షిండేకు తన సొంత పార్టీ పైనే నియంత్రణ లేదని అన్నారు. పార్టీపరంగా షిండే ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని విమర్శించారు. కానీ బాబాసాహెబ్ సిద్ధాంతాలతో నడుస్తున్న మా శివసేన విధానాలు ఇలాంటి వాటికి పూర్తిగా విరుద్ధమన్నారు. తమకు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News