Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్.. వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో..

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది .

Update: 2025-01-03 07:35 GMT

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ సక్సెస్.. వేగంతో పాటు అధునాతన సౌకర్యాలతో..

Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్ రైళ్లు మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది .రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో వందే భారత్ స్లీపర్ రైలుకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రైలు గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.దీనికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్టు చేశారు. ఇంత వేగంతో వెళ్తున్న రైళ్లో ట్రే పై పెట్టిన గ్లాసులో చుక్క నీరు కూడా పడకపోవడం విశేషం.

ఈ రైలును జనవరి 1న 130 కి.మీ వేగంతో నడిపారు. ఆ తర్వాత వేగాన్ని 140, 150,160 కి పెంచారు. తాజాగా గురువారం ఈ వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచారు. ఆ సమయంలో రైలు మొత్తం ప్రయాణికులు.. వారి లగేజి ఉంటే ఎంత మేర బరువు ఉంటుందో అదే స్థాయిలో సమం చేసేలా బరువు రైలులో ఉంచారు. విభిన్నమైన ట్రాక్ పరిస్థితుల్లో దీనిని పరీక్షించారు. మరిన్ని ట్రాక్‌లపైన పరీక్షించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ రైలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ రైలులో 10 థర్డ్ ఏసీకి, 4 సెకండ్ ఏసీకి, ఒక బోగీ ఫస్ట్ ఏసీకి కేటాయించారు. వందే భారత్ రైలులో సీటింగ్‌తో పాటు లగేజీ కోసం 2 బోగీలు ఉంటాయని అధికారులు వివరించారు.

వందే భారత్ రైలు ప్రత్యేకతలు

వందే భారత్ స్లీపర్ రైలుకు అనేక ప్రత్యేకతలున్నాయి. విమానం తరహాలో ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యాలుంటాయి. 5 స్టార్ హోటల్స్ తలదన్నేలా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. వందే భారత్ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ స్పీడ్‌తో వెళ్లేలా తయారు చేశారు. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి.

ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్‌తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. అలాగే రైలులో అత్యాధునిక సేవలు అందించనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్ ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

టాయిలెట్‌లో ఎలాంటి బటన్ నొక్కకుండానే నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్‌లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ సైతం ఉటుంది. అలాగే సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా పుస్తకాలు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ కవచ్ సిస్టమ్, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణికుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది.

భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తున్నాయి. 2019లో ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మంచి ఆరదణ లభిస్తుంది. ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్ వర్షన్ అందుబాటులోకి తెచ్చింది.


Tags:    

Similar News