OYO Hotels - No Entry for Unmarried Couples: ఓయో హోటల్ కొత్త చెక్-ఇన్ రూల్స్ ఇవే

No more entry for unmarried couples into OYO Hotels: దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో హోటల్స్‌తో అగ్రిమెంట్ చేసుకుని లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ బిజినెస్ రన్ చేస్తోన్న ఓయో హోటల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సిటీలోని హోటల్స్‌లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఓయో తేల్చిచెప్పింది.

Update: 2025-01-05 07:34 GMT

No more entry for unmarried couples into OYO Hotels: దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో హోటల్స్‌తో అగ్రిమెంట్ చేసుకుని లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ బిజినెస్ రన్ చేస్తోన్న ఓయో హోటల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సిటీలోని హోటల్స్‌లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఓయో తేల్చిచెప్పింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ సిటీ నుండి ఓయో ఈ సరికొత్త నిర్ణయం అమలు చేయడం ప్రారంభించింది. మీరట్‌లో ఓయోతో అగ్రిమెంట్ చేసుకున్న హోటల్స్‌కు చెక్-ఇన్ పాలసీని మారుస్తున్నట్లు ఓయో ప్రకటించింది.

ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకున్నా... ఆఫ్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకున్నా... వారిని లోపలికి అనుమతించేటప్పుడు వారికి పెళ్లి అయిందా లేదా అనేది నిర్ధారించుకున్న తరువాతే హోటల్‌లోకి అనుమతించాల్సిందిగా ఓయో స్పష్టంచేసింది. అంటే మీరట్‌లో ఓయో ప్రవేశపెట్టిన ఈ కొత్త పాలసీ ప్రకారం ఓయో అనుబంధ హోటల్స్‌లో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమకు పెళ్లయిందని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట.

హోటల్‌కు వచ్చిన జంటలకు పెళ్లి అయిందా కాలేదా అని నిర్ధారించి నిర్ణయం తీసుకునే హక్కు ఆయా హోటల్స్‌కే వదిలేస్తున్నట్లు ఓయో వెల్లడించింది. పెళ్లి కాని జంటలు హోటల్ రూమ్ బుక్ చేసుకుంటే వారికి హోటల్ నిర్వాహులు నో చెప్పై రైట్ ఓయో ఇచ్చింది.

మీరట్‌లో ఈ కొత్త పాలసీకి ఎలాంటి స్పందన వస్తుందో చూసి, ఆ తరువాత మిగతా నగరాలు, పట్టణాలకు కూడా ఈ కొత్త పాలసీని విస్తరించే యోచనలో ఓయో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓయో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణాలను ఓయో సంస్థ ఉత్తర భారత్ రీజినల్ హెడ్ పవాస్ శర్మ వివరించారు. వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛని గౌరవిస్తూనే స్థానిక సెంటిమెంట్స్, సమాజంలో విలువలను పాటించే బాధ్యతను కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఓయో ఈ నిర్ణయానికొచ్చినట్లు ఆయన చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags:    

Similar News