MP Tejaswi Surya: త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న యువ ఎంపీ తేజస్వీ సూర్య

Update: 2025-01-01 02:36 GMT

 MP Tejaswi Surya: బిజెపి యువ ఎంపీ తేజశ్రీ సూర్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. బెంగళూరు సౌత్ కు చెందిన లోకసభ ఎంపీ తేజ శ్రీ సూర్య చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, భరతనాట్య కళాకారుని శివశ్రీ స్కంద ప్రసాదన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు తేజశ్రీ సూర్య మంగళవారం ప్రకటించారు.

మార్చి 24వ తేదీన బెంగళూరులో వీరి వివాహం జరగనుంది. తేజశ్రీ సూర్య కాబోయే భార్య శివశ్రీ స్కంద ప్రసాద్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ సాంస్కృతిక కళాకారుని. ఆమె కర్ణాటక సంగీత గాయని మాత్రమే కాదు.. నిష్ణాతులైన భరతనాట్య కళాకారుని కూడా. శివశ్రీ తన కళతో పాటు విద్య రంగంలో కూడా ఎన్నో విజయాలు సాధించింది. చెన్నై విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, చెన్నై సాంస్కృతిక కళాశాల నుండి సంస్కృతంలో ఎంఏ పట్టా పొందారు.

శివశ్రీ స్కంద ప్రసాద్ సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఆమెకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. పాపులర్ సినిమా పొన్నియన్ పార్ట్ 2 కన్నడ వర్షన్ లో తన గాత్రాన్ని అందించడం ద్వారా ఆమె మరింత ప్రజాదరణ పొందారు. కళ విద్యతో పాటు శివశ్రీ సైక్లింగ్ ట్రేకింగ్ నడక వంటి హాబ్బిస్ కూడా ఉన్నాయి.

తేజస్వీ సూర్య, శివశ్రీ స్కంద ప్రసాద్ కుటుంబాలు వీరి పెళ్లికి సన్నాహాలు ప్రారంభించాయి. ఈ వివాహానికి రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు హాజరుకానున్నారు. తేజస్వీ సూర్య తన రాజకీయలో క్రియాశీలత చురుకైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Tags:    

Similar News