రాజస్థాన్ బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక చేతన వెలికితీత

రాజస్థాన్ లోని కోట్‌పుత్లీలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలికను బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. 10 రోజుల తర్వాత ఎట్టకేలకు చిన్నారిని వెలికితీశారు.

Update: 2025-01-01 14:31 GMT

 రాజస్థాన్ బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక చేతన వెలికితీత

రాజస్థాన్ లోని కోట్‌పుత్లీలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలికను బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. 10 రోజుల తర్వాత ఎట్టకేలకు చిన్నారిని వెలికితీశారు. 2023 డిసెంబర్ 23న ఆడుకుంటూ బాలిక బోరు బావిలో పడింది. దీనిపై చేతన తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వి చేతనను కాపాడారు.

చేతన 150 నుంచి 160 అడుగుల లోతు బోరు బావిలో పడిపోయింది. జిల్లా కలెక్టర్ కల్పనా అగర్వాల్ ఈ రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించారు. డిసెంబర్ 24 నుంచి సాయంత్రం వరకు చిన్నారిలో ఎలాంటి కదలికలు లేదని పేరేంట్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన కూతురును కాపాడాలని తల్లి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోరుబావి నుంచి వెలికి తీసిన బాలికను వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బోరువేసిన తర్వాత వాటిని పూడ్చివేయని కారణంగా చిన్నారులు బోరు బావిలో పడిన ఘటనలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగాయి. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. బోరు బావిలో పడిన చిన్నారుల్లో ఎక్కువ మంది చిన్నారులు సురక్షితంగా బయట పడిన ఘటనలు అరుదుగా ఉన్నాయి. చాలా ఘటనల్లో చిన్నారులు మరణించిన ఘటనలున్నాయి.

Tags:    

Similar News