హోటల్‌కు తీసుకెళ్లి.. తల్లి, నలుగురు చెల్లెళ్లను హత్య చేసిన సోదరుడు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ హోటల్ లో తల్లి, నలుగురు చెళ్లెళ్లను ఓ యువకుడు హత్య చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ హోటల్ లో తల్లి, నలుగురు చెళ్లెళ్లను ఓ యువకుడు హత్య చేశారు. నిందితుడు ఆగ్రాకు చెందిన అర్ధస్ ద్ గా గుర్తించారు.పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ కలహలతోనే నిందితుడు ఈ హత్యలు చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హోటల్ రూమ్ రక్తం మడుగులో ఉంది. మృతులు తిన్న ఆహారంలో మత్తు పదార్ధాలు కలిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆహారం తిని మత్తులోకి జారుకొన్న తర్వాత నిందితుడు ఐదుగురిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యల సమయంలో కొందరు ప్రతిఘటించారని సంఘటనస్థలాన్ని బట్టి పోలీసులు అంచనాకు వచ్చారు.
గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ఆగ్రా నుంచి వచ్చిన కుటుంబం లక్నోలోని హోటల్ లో ఉంటుంది. మృతులను ఆర్షద్ తల్లి ఆస్మా, అతని చెల్లెళ్లుగా గుర్తించారు. మృతదేహలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.విచారణ తర్వాత పూర్తి వివరాలను చెబుతామని లక్నో పోలీస్ ఉన్నతాధికారి రవీనా త్యాగి తెలిపారు.