LPG Price Cut: కేంద్రం కొత్త సంవత్సరం గిఫ్ట్.. తగ్గిన గ్యాస్ సిలిండర ధర.. కొత్త రేట్లు ఇవే

Update: 2025-01-01 04:52 GMT

LPG Price Cut: కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం గిఫ్ట్ ప్రకటించింది. ఎల్పిజి గ్యాస్ ధరలను భారీగా తగ్గించింది. ప్రతి నెలా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ఒకటో తేదీన సవరణ జరుగుతుంది. ఈసారి 14.50 పైసలు తగ్గించింది. దీంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట లభించినట్లయ్యింది. గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు లేవు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రమే తగ్గాయి. ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం

కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాల కోసం 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలు తగ్గిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఢిల్లీ నుండి ముంబై వరకు రూ.14-16 తగ్గాయి. అయితే దేశీయంగా వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.803 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, హోటల్లు, రెస్టారెంట్లు వంటి వివిధ సంస్థల్లో ఉపయోగించే వాణిజ్య LPG ధర ఇప్పుడు దేశ రాజధానిలో 19 కిలోల సిలిండర్‌కు రూ. 1804 గా ఉంటుంది. ఇది గతంలో రూ. 1818.50 గా ఉండేది.

డిసెంబర్ నెలలో LPG సిలిండర్లు ధర పెరిగింది. ప్రభుత్వ చమురు కంపెనీలు వాణిజ్య LPG సిలిండర్ల ధరలను పెంచాయి. ఇండియన్ ఆయిల్ ప్రకారం, 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 16.50 పెరిగింది. ఇంతకు ముందు కూడా, నవంబర్ నెలలో వాణిజ్య LPG సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు నెల మొదటి రోజు గ్యాస్ సిలిండర్ల ధరలను నిర్ణయిస్తాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు జనవరి 1 నుంచి విమాన ఇంధన ధరలను తగ్గించాయి. డిసెంబర్‌లో విమాన ఇంధనం (ఎటిఎఫ్) ధరలో కిలో లీటరుకు రూ.11401.37 ఉపశమనం లభించింది. 

Tags:    

Similar News