New Year in India: ఘనంగా న్యూఇయర్ వేడుకలు..ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

Update: 2025-01-01 01:27 GMT

New Year in India: భారతదేశంలో న్యూ ఇయర్ సంబురాలు అదిరిపోయాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెప్పారు. ఈ ఏడాది అందరికీ సుఖసంతోషాలు పంచాలి అని కోరుకున్నారు. యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి కేరింతల కొడుతూ సంబరాలు చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ డీజే మోత మోగించారు.

2024వ సంవత్సరంలో చెప్పుకోదగ్గవి చాలా జరిగాయి అన్నారు ప్రధాని మోదీ. ఈ అంశాలతో కూడిన వీడియో చేశారు. 2025లో అందరూ కలిసి అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం దిశగా అడుగులు వేద్దామని కోరారు ప్రధానమంత్రి మోడీ. ఆ వీడియోను చూడండి.


ఏపీలోని విజయవాడలో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై కేరింతల కొడుతూ న్యూ ఇయర్ సంబరాలు చేసుకున్నారు.


తెలంగాణ కొత్త సంవత్సరం వేడుకలు అదిరిపోయాయి. హుస్సేన్ సాగర్ వద్ద బుద్ధుడు రంగరంగుల కాంతులు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పాడు.


జమ్మూ కాశ్మీర్లో మంచులో కేరింతలు కొడుతూ ప్రజలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు.


తమిళనాడులో మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కొత్త సంవత్సరానికి ఆహ్వానించారు.


గోవాలో ప్రజలు బీచ్ దగ్గరికి వెళ్లి బాణా సంచాలు కాల్చుతూ న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పారు.


ఇలా దేశవ్యాప్తంగా ప్రజలు న్యూ ఇయర్ సంబురాలు చేసుకున్నారు.

Tags:    

Similar News