New Year-Temples: కొత్త సంవత్సరం వేళ..ఆలయాల్లో ప్రత్యేక పూజలు..తిరుమలకు పోటెత్తిన భక్తులు
New Year-Temples: కొత్త సంవత్సరం వేళ.. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం తొలిరోజు బాగుంటే.. ఏడాదంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో కొంతమంది ఆలయాలకు వెళ్తున్నారు. ఈ ఏడాది అంతా సంతోషంగా ఉండేలా దీవించమని కోరుతున్నారు. 2025 తొలి రోజున తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ఈ కొత్త ఏడాది అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అస్సిగాట్లో కొత్త సంవత్సరం తొలిరోజు గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాలయంలో భస్మహారతి కార్యక్రమం నిర్వహించారు. కొత్త సంవత్సరం తొలి రోజున భక్తులు భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు.
ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో ఉదయం హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పంజాబ్ లోని స్వర్ణ దేవాలయం బంగారు కాంతులతో మెరిసిపోయింది. కొత్త సంవత్సరంలో స్వర్ణ దేవాలయం దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అయోధ్యలోని శ్రీ విశ్వవిరాట్ రాఘవ ఆలయంలో డిసెంబర్ 31న చివరి హారతి ఇచ్చారు.
ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు, ప్రార్థన స్థలాలకు కొత్త సంవత్సరం తొలి రోజు దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు .