Mizoram Exit Poll 2023: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..

Mizoram Exit Poll 2023: మిజోరం ఎగ్జిట్‌ పోల్స్‌.. ఈసారి అధికారం ఎవరిదంటే?

Update: 2023-11-30 14:01 GMT

Mizoram Exit Poll 2023: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే.. 

Mizoram Exit Poll 2023: మిజోరంలో హంగ్ వచ్చే పరిస్థితి కనబడుతోంది. ఆ రాష్ట్రంలో మొత్తం 40స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం 21సీట్లు రావాలి. కానీ ఏ పార్టీకి స్పష్టమైన మెజారీ వచ్చే పరిస్థితి లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ను బట్టి చూస్తే తెలుస్తోంది. MNF, ZPM పార్టీల మధ్య టఫ్‌ ఫైట్ నడిచే అవకాశం ఉంది.

పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ... MNFకు 16 నుంచి 20స్థానాలు, ZPMకు 10 నుంచి 14 స్థానాలు, బీజేపీకి 6నుంచి 10, కాంగ్రెస్‌కు 2నుంచి 3స్తానాలు వచ్చే చాన్స్ ఉన్నట్టు తెలిపింది. అలాగే జన్‌కీ బాత్.. MNF పార్టీకి 10నుంచి 14, ZPMకు 15నుంచి 25వరకు, కాంగ్రెస్‌కు 5నుంచి 9, బీజేపీకి 0 నుంచి 2స్తానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. హంగ్ వస్తే.. ఇతర పార్టీల మద్దతుతో.. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

మిజోరం (40): ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు

జన్‌ కీ బాత్‌: MNF 10-14, ZPM 15-25, CONG 5-9, BJP 0-2

ఇండియా టీవీ: MNF 14-18, ZPM 12-16, CONG 8-10, BJP 0-2

Tags:    

Similar News