మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు షాక్

AIADMK: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్రాసు హైకోర్టు షాకిచ్చింది.

Update: 2022-09-02 16:15 GMT

మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు షాక్

AIADMK: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టిన డివిజన్ బెంచ్ మరో మాజీ సీఎం పళనిస్వామికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జులై 11న జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మీటింగ్‌ చెల్లుతుందని స్పష్టం చేసింది. AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైందేనని పేర్కొంది.

జులై 11న జరిగిన AIDMK జనరల్ కౌన్సిల్ సమావేశంపై పన్నీరు సెల్వం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్చి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పళనిస్వామి కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎం.దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను తోసి పుచ్చింది. తాజా తీర్పుతో అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పళని స్వామికే దక్కనున్నాయి. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పన్నీరు సెల్వం తెలిపారు.

Tags:    

Similar News